Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్.. తొలి భారత క్రికెటర్‌గా..

Rohit Sharma Ipl Record

Rohit Sharma Ipl Record

Rohit Sharma Creates New Record In IPL: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 250 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. శనివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు సిక్సులు కొట్టిన రోహిత్.. ఈ సందర్భంగానే ఆ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఏకంగా 357 సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత ఏబీ డీ విలియర్స్ 251 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా.. 250 సిక్స్‌లతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 235 సిక్స్‌లతో నాలుగో స్థానంలోనూ, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 229 సిక్స్‌లతో ఐదో స్థానంలోనూ ఉన్నారు.

Bhatti Vikramarka: ప్రజల్లో కాంగ్రెస్ ఉండకూడదని.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. చివరివరకు గట్టిగానే పోరాడింది కానీ, ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ వేసి, తన పంజాబ్ జట్టుని గెలిపించుకున్నాడు. వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో.. మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అవ్వడం, పంజాబ్ గెలుపొందడం జరిగింది. ముంబై బ్యాటర్లలో ‍గ్రీన్‌(67), సూర్యకుమార్‌ యాదవ్‌(57), రోహిత్‌ శర్మ(44) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 214 పరుగులు చేసింది.

Etela Rajender: రాజ్యాధికారం రావాలంటే చేతల్లో చూపించాలి

Exit mobile version