Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 16,000 పరుగుల అద్భుతమైన మార్క్‌ను చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నాడు. ఒమర్జాయ్ వేసిన బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీని రోహిత్ శర్మ తనదైన శైలిలో అద్భుతమైన ఫుల్ షాట్‌తో స్క్వేర్ లెగ్ స్టాండ్స్‌లోకి భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ సిక్సర్‌తోనే ఓపెనర్‌గా 16 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటేశాడు. ప్రపంచ క్రికెట్లో ఓపెనర్‌గా వచ్చి ఈ స్థాయిలో పరుగులు సాధించిన అతికొద్ది మంది దిగ్గజాల సరసన రోహిత్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి డీప్ మిడ్-వికెట్ మీదుగా మరో ఫోర్ కొట్టి రోహిత్ మంచి టచ్‌లో కనిపించాడు. ఇండియా నుంచి మొదటి స్థానంలో విరేంద్ర సేహ్వాగ్ ఉన్నాడు.
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించారు. భారత్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసి ఊపుమీదున్నాు. రోహిత్ శర్మ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ప్రస్తుత రన్ రేట్ 9.9 గా ఉండగా.. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 162 పరుగులు చేయాల్సి ఉంది.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సాధించిన ఈ 16,000 పరుగుల రికార్డు అతని నిలకడకు, క్లాస్‌కు నిదర్శనం. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతనికి ఉన్న తిరుగులేని రికార్డులు, ముఖ్యంగా వన్డేల్లో అతనికున్న మూడు డబుల్ సెంచరీలు అతనిని ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా నిలబెట్టాయి. ధర్మశాల మైదానంలో రోహిత్ శర్మ తన ట్రేడ్‌మార్క్ సిక్సర్‌తో ఈ ఘనత సాధించడం అభిమానులను ఎంతగానో అలరించింది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!