Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్‌బై

  • IPL 2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర వైఫల్యం.
  • కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించిన రిషబ్ పంత్.
Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: ఐపీఎల్ 2026లో ఘోర పరాజయాలతో లక్నో సూపర్‌ జెయింట్స్(LSG) కుదేలైంది. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 27 కోట్లు పలికిన కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా సత్తా చాటలేకపోయారు. 2026 సీజన్‌లో లక్నో జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని రిషబ్ పంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఉపశమనం కల్పించాలన్న పంత్ అభ్యర్థనను తాము అంగీకరించినట్లు తెలిపింది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. దీనికి ముందు 2025లో కూడా ఇలాంటి ఆటతీరును కనబరిచింది. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌లకు గాను కేవలం ఆరు మాత్రమే గెలిచారు. అంటే, పంత్ జట్టు బాధ్యతలు చేపట్టిన తన 28 మ్యాచ్‌లలో పంత్ మొత్తం 10 విజయాలు మాత్రమే సాధించాడు. ఇదే సమయంలో పంత్ ఫామ్ కూడా బాగా లేదు. 2025లో 14 మ్యాచ్‌లలో పంత్ కేవలం 269 పరుగులు చేయగా, ఈ ఏడాది మొత్తం 312 పరుగులు మాత్రమే చేశాడు.

×
×
Ad