India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పు.. 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌కు కీలక బాధ్యతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subhadeep Ghosh Likely To Appoints as India Fielding Coach: శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా కోచింగ్ బృందంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ అసోం, రైల్వేస్ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ అనంతరం టీ. దిలీప్ ఒప్పందాన్ని బీసీసీఐ పునరుద్ధరించకపోవడంతో ఆయన స్థానంలో ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌నే ఆయన తొలి అసైన్మెంట్గా భావిస్తున్నారు.
శుభదీప్ ఘోష్ 1994 నుంచి 2004 మధ్యకాలంలో మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆటగాడిగా కెరీర్ ముగిసిన తర్వాత కోచ్‌గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అసోం సీనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయడంతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), భారత మహిళల జట్టు, ఇండియా-ఏ జట్లకు కూడా సేవలందించాడు. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లతో కూడా పనిచేసిన అనుభవం ఉంది. శుభదీప్ నియామకాన్ని అసోం క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ధృవీకరించింది. భారత జట్లతో పనిచేస్తూ కోచ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఘోష్‌కు ఇది గొప్ప గౌరవమని అసోసియేషన్ పేర్కొంది. ఘోష్ నియామకం అసోం క్రికెట్‌కు గర్వకారణమని.. యువ క్రికెటర్లు, కోచ్‌లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో ఇటీవల పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో శుభదీప్ ఘోష్ రాకతో కోచింగ్ బృందానికి మరింత బలం చేకూరుతుందని బీసీసీఐ భావిస్తోంది. టెన్ డస్కటే మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. నైట్ రైడర్స్ స్పోర్ట్స్‌కు ‘హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ’గా నియమితుడయ్యాడు. ఈ బాధ్యతల్లో భాగంగా ప్రతిభావంతులైన ఆటగాళ్ల అన్వేషణ, జట్టు ప్రణాళిక, ఆటగాళ్ల ఎంపిక, పనితీరు విశ్లేషణ వంటి అంశాలను పర్యవేక్షించనున్నాడు. అలాగే ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, అబుదాబి నైట్‌రైడర్స్, లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్ జట్లకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించనున్నాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..