NTV Telugu Site icon

Rishabh Pant: చరిత్ర సృష్టించిన పంత్.. ఆ రికార్డ్ సాధించిన తొలి క్రికెటర్

Rishabh Pant Record

Rishabh Pant Record

Rishabh Pant Creates Sensational Record In Tests: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచిన పంత్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మాత్రం మంచి ప్రదర్శన కనబరిచాడు. కేవలం 40 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పంత్ రెండు భారీ సిక్స్‌లు బాదడంతో.. టెస్టుల్లో మొత్తం 50 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో.. టెస్టుల్లో ఈ ఫీట్ అత్యంత వేగంగా అందుకున్న తొలి క్రికెటర్‌గా పంత్ చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్‌గానూ పంత్ నిలిచాడు.

Nitish Kumar: ‘మీరే తాగుబోతులు, మధ్య నిషేధంపై మాట్లాడేది మీరా?’.. బీజేపీ ఎమ్మెల్యేలపై సీఎం నితీష్ ఫైర్

ఇప్పటి వరకు 128 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 4021 పరుగులు సాధించాడు. వీటిలో అతడు వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ.. 3651 రన్స్‌ (109 మ్యాచ్‌లు) నమోదు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు 15 అర్థశతకాలున్నాయి. అగ్రస్థానంలో మాత్రం భారీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. తన కెరీర్‌లో మొత్తం 535 మ్యాచ్‌లు ఆడిన ధోని.. ఓవరాల్‌గా 17092 పరుగులు సాధించాడు. వీటిలో 15 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా.. బంగ్లాతో జరుగుతున్న టెస్ట్‌లో.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే పంత్ చెలరేగడాన్ని చూసి, ఈ మ్యాచ్‌లో అతడు భారీ పరుగులు సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. 31.4 ఓవర్ వద్ద అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న పంత్‌ను మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్

మరోవైపు.. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (22), శుభ్మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (1) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్.. కాసేపు మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పుజారా, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. వీళ్లు ఆల్రెడీ అర్థశతకాలు చేసేసి, భారత్‌ని ఆదుకున్నాడు. టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరుని జోడించడంలో నిమగ్నమయ్యారు.