NTV Telugu Site icon

Rishab Pant: రిషబ్ పంత్ మోకాలికి శస్త్రచికిత్స విజయవంతం

Rishab Pant

Rishab Pant

Rishab Pant: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మెరుగైన చికిత్స కోసం ఇటీవల పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగ్మెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్‌ను ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. శుక్రవారం నాడు పంత్ మోకాలికి ఆపరేషన్ జరిగిందని.. ఈ సర్జరీ విజయవంతమైందని ఈరోజు బీసీసీఐ వెల్లడించింది.

Read Also: Big Breaking: కూకట్ పల్లిలో కూలిన అంతస్తు…. శిథిలాల కింద కార్మికులు

కాగా రిషబ్ పంత్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. కనీసం 8 నుంచి 9 నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దీంతో పంత్ ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు సైతం దూరం అవుతాడనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పంత్ 8 నెలల తర్వాత కోలుకున్నా.. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అతడికి మరింత టైం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడు ఈ ఏడాదంతా క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.