Site icon NTV Telugu

Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం..!

Rinku Singh

Rinku Singh

Rinku Singh: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు సెమీస్ ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే మ్యాచులు కీలకంగా మారాయి. ఈ మ్యాచుల్లో భారత్ భారీ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత హిట్టర్ రింకూ సింగ్ అత్యవసర కుటుంబ కారణాల వల్ల టీమ్‌ను వీడినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, రింకూ తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, అతడిని గ్రేటర్ నోయిడాలోని స్థానికి ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది. తండ్రి అనారోగ్యం గురించి సమాచారం అందిన వెంటనే చెన్నై నుంచి వెళ్లిపోయారు.

Read Also: Andhra Pradesh Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 56 అజెండా అంశాలకు ఆమోదం..

ఆయన తండ్రి ప్రస్తుతం వెంటిటేలర్ సహాయంతో ఉన్నారని వైద్యులు నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో రింకూ ఆయన కుటుంబ సభ్యులతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రింకూ జింబాబ్వేతో జరిగే తరుపరి మ్యాచ్ ఆడటం సాధ్యం కాదని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్ జట్టు యాజమాన్యం, సహాయక సివబ్ంంది రింకూ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

టీమ్ ఫినిషర్ రోల్‌లో ఈ సారి పెద్దగా ప్రభావం చూపించడం లేదు. రింకు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. అతను USA పై 14 బంతుల్లో 6 పరుగులు, నమీబియా పై 6 బంతుల్లో 1 పరుగు, పాకిస్తాన్ పై 4 బంతుల్లో 11 నాటౌట్, నెదర్లాండ్స్ పై 3 బంతుల్లో 6 నాటౌట్ సాధించాడు. దక్షిణాఫ్రికా పై, అతను కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి, పరుగులు చేయకుండానే ఔటయ్యాడు.

Exit mobile version