సెలబ్రిటీలు, క్రికెటర్లపై వదంతులు రావడం సహజమే. అంతేకాదు.. హీరోలు గానీ, హీరోయిన్లు గానీ, క్రికెటర్లు గానీ లవ్ మ్యారేజ్‌లు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ నటి అనుష్క శర్మ-క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై కూడా పుకార్లు వస్తున్నాయి. హిందీ నటి రిధిమా పండిట్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు రిధిమా పండిట్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దీంతో పెళ్లి వార్త తాజాగా హల్‌చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Physical Harassment : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ.. రూంలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన డీఎస్పీ
పెళ్లి పుకార్లపై రిధిమా పండిట్ స్పందించారు. ఇప్పటి వరకు వినని హాస్యాస్పదమైన, విచిత్రమైన వార్తలు వింటున్నానని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ జీవితంలో శుభ్‌మన్ గిల్‌ను చూడలేదన్నారు. టీవీల్లో చూడడం తప్ప.. నేరుగా తనకు తెలియదు అన్నారు. వివాహంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తనకు అభినందనలు రావడం మాత్రం వాస్తవమేనని చెప్పుకొచ్చారు. ఒకవేళ శుభ్‌మన్ గిల్ ఎదురుపడితే.. ఈ విషయంపై నవ్వుకుంటామని చెప్పింది. అయినా ఇలాంటి పుకార్లను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అయినా తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు చూసుకుంటారని తేల్చి చెప్పారు.
రిధిమా పండిట్ నటించిన సికందర్ కా ముఖద్దర్ సినిమా అక్టోబర్ 29న విడుదలైంది. ఈ చిత్రంలో తమన్నా, అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్‌తో కలిసి ఓ కీలక పాత్రల్లో రిధిమా పండిట్ నటించింది.
ఇది కూడా చదవండి: Minister Sridhar Babu : ఆ పదవికి కేటీఆర్ రాజీనామా.. మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యత