IPL 2022: లక్నో ఔట్.. క్వాలిఫయర్-2కు ఆర్సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2022 సీజన్లో గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ మిని ఫైనల్ మ్యాచ్‌ను తలపించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరును లక్నో ముందు ఉంచింది. గత మ్యాచ్‌లో మెరిసిన కోహ్లీ 25 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ డుప్లెసిస్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అయితే, క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ చెలరేగాడు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఐపీఎల్లో తొలి శతకం నమోదు చేశాడు. 54 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 112 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో పటీదార్ కీలక పాత్ర పోషించాడు.
దీంతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. శుక్రవారం రాజస్తాన్‌తో క్వాలిఫయర్-2లో బెంగళూరు తలడపడనుంది. ఇక ఈ సీజన్లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో వెనుదిరిగింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆఖరి వరకు పోరాడినప్పటికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, సిరాజ్, హర్షల్ పటేల్, హసరంగా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
తాజావార్తలు
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!