RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parthiv Patel About RCB Captaincy: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), విరాట్ కోహ్లీకి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఆర్సీబీ ఫ్రాంచైజీకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో కోహ్లీని ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను మరో ఆటగాడికి అప్పగించాలని జట్టు యాజమాన్యం ఆలోచించిందట. ఈ విషయాన్ని ఆర్సీబీ మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ చెప్పాడు. ఆర్సీబీ కోచింగ్ బృందం కింగ్ కోహ్లీని తప్పించి తనను కెప్టెన్ చేయాలనుకున్నారని పేర్కొన్నాడు. ఇప్పుడు పార్థివ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పార్థివ్ పటేల్‌కు కెప్టెన్సీ:
విరాట్ కోహ్లీ 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అతడి నాయకత్వంలో ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ గెలవలేకపోయింది. 2021 సీజన్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2019 సీజన్‌కు ముందు కోహ్లీ స్థానంలో తనను కెప్టెన్‌గా నియమించే ఆలోచనను అప్పటి ఆర్సీబీ కోచింగ్ బృందం పరిశీలించిందని తాజాగా ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్లో జరిగిన సంభాషణలో టీమిండియా మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు. అప్పట్లో ఆర్సీబీ కోచింగ్ బృందంలో ఉన్న ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్ తనను కెప్టెన్సీకి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిపాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
- Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
నన్ను సిద్ధంగా ఉండమన్నారు:
‘నేను ఈ విషయం గురించి ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే మొయిన్ అలీ ఓ ఇంటర్వ్యూలో ఆర్సీబీ కెప్టెన్సీ విషయాన్ని ప్రస్తావించాడు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. వచ్చే ఏడాది కెప్టెన్సీ గురించి ఆలోచిస్తున్నామని, అందుకు సిద్ధంగా ఉండాలని ఆర్సీబీ కోచింగ్ బృందంలోని ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్ నాకు చెప్పారు. కానీ ఆ ప్రతిపాదన చేసిన ఆ ఇద్దరు తర్వాత జట్టులో లేరు. వారి స్థానంలో కొత్త కోచ్‌లు వచ్చారు. ఆ సీజన్లో నాకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు’ అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మొయిన్ అలీ ఏమన్నాడంటే?:
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కూడా గతంలో ఈ అంశంపై మాట్లాడాడు. అప్పట్లో పార్థివ్ పటేల్‌ను ఆర్సీబీ తదుపరి కెప్టెన్‌గా నియమించే అవకాశాన్ని పరిశీలించినట్లు తెలిపాడు. పార్థివ్‌కు ఆటపై మంచి అవగాహన ఉందని, అతడికి క్రికెట్‌పై అద్భుతమైన ఆలోచనా విధానం ఉందని అలీ అభిప్రాయపడ్డాడు. ‘గ్యారీ కిర్‌స్టన్ ఆర్సీబీతో ఉన్న చివరి ఏడాది తర్వాత పార్థివ్ పటేల్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు గుర్తుంది. అతడికి క్రికెట్‌పై మంచి అవగాహన ఉంది. అప్పట్లో ఇదే చర్చ జరిగింది. చివరకు ఆ నిర్ణయం ఎందుకు అమలు కాలేదో నాకు తెలియదు. కానీ కెప్టెన్సీ కోసం పటేల్‌ను పరిశీలించారని మాత్రం నాకు తెలుసు’ అని మొయిన్ అలీ స్పోర్ట్స్టాక్ లో చెప్పాడు.
చివరకు కోహ్లీనే కెప్టెన్‌గా:
పార్థివ్ పటేల్‌కు కెప్టెన్సీ అప్పగించాలనే ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో విరాట్ కోహ్లీ 2019, 2020, 2021 సీజన్లలోనూ ఆర్సీబీకి నాయకత్వం వహించాడు. 2021 సీజన్ అనంతరం అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా కోహ్లీ ఆర్సీబీతోనే కొనసాగుతూ జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. ఆర్సీబీ కెప్టెన్సీ విషయంలో అప్పట్లో జరిగిన ఈ పరిణామాలపై పార్థివ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!