Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌తో పాటు వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. న్యూజిలాండ్ తుది జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటమే సుందర్ ఎంపికకు ప్రధాన కారణమని కోటక్ తెలిపారు. టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడంతో.. వారిని ఎదుర్కొనేందుకు సుందర్ ఆఫ్ స్పిన్ ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావించినట్లు చెప్పారు.
తొలి టెస్టులో భారత్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడంపై కూడా సితాన్షు కోటక్ వివరణ ఇచ్చారు. ఐదు రోజుల ఆటను దృష్టిలో పెట్టుకుని విభిన్న నైపుణ్యాలు కలిగిన బౌలింగ్ విభాగాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ బంతిని స్వింగ్ చేయగలరని.. ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కాంబోజ్ సీమ్ మూవ్‌మెంట్‌తో పాటు అదనపు వేగాన్ని అందించగలరని వివరించారు. ‘ఇద్దరు బౌలర్లు బంతిని బాగా స్వింగ్ చేయగలరు. మరో ఇద్దరు సీమ్ మూవ్‌మెంట్‌తో పాటు వేగాన్ని కూడా రాబట్టగలరు. తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు ఐదు రోజుల ఆటను దృష్టిలో పెట్టుకుంటాం’ అని కోటక్ పేర్కొన్నారు. అంటే ఒక్కరోజు పరిస్థితులనే కాకుండా, మ్యాచ్ మొత్తం అవసరాలను పరిగణనలోకి తీసుకుని బౌలింగ్ విభాగాన్ని ఎంపిక చేసినట్లు చెప్పాడు.
Also Read
- Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
- NZ vs IND 1st Test: నికోల్స్ సెంచరీ, ఫిలిప్స్ విధ్వంసం.. 70కే 5 వికెట్స్ కోల్పోయినా కివీస్‌దే పైచేయి!
- World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
- MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక గురించి కూడా కోటక్ స్పందించారు. ప్రసిద్ధ్ వికెట్లు తీయాలనే లక్ష్యంతో దూకుడుగా బౌలింగ్ చేసే ఆటగాడని చెప్పారు. అయితే అతడి దూకుడు కారణంగా కొన్నిసార్లు ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందని వివరించారు. వికెట్లు తీసినప్పుడు ప్రశంసించే అభిమానులు, పరుగులు ఇచ్చినప్పుడు విమర్శిస్తారని వ్యాఖ్యానించారు. తొలి రోజు వికెట్లు తీయలేకపోయినంత మాత్రాన అతడి ప్రదర్శనపై తొందరపడి నిర్ణయానికి రావద్దని సూచించారు. ఇక వెల్లింగ్టన్లో తొలి రోజు ఆటలో భారత బౌలర్లు ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. చివరి సెషన్లో న్యూజిలాండ్ బ్యాటర్లు పుంజుకున్నారు. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కివీస్ 70 పరుగులకే ఐదు వికెట్లు కొల్పోయింది. బుమ్రా మూడు కీలక వికెట్లు పడగొట్టగా, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు. అయితే ఆ తర్వాత నికోల్స్, ఫిలిప్స్ భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపారు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!