Team India Coach: రవిశాస్త్రి రీఎంట్రీ.. కానీ ఓ కండిషన్?
- భారత క్రికెట్ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ
- రవిశాస్త్రి రీఎంట్రీ
- రవిశాస్త్రి రీఎంట్రీ అసాధ్యమేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మళ్లీ టీమిండియాకు సేవలందించేందుకు రాబోతున్నాడా? అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు రవిశాస్త్రి రీఎంట్రీ సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2029 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) వరకు రవిశాస్త్రిని టెస్ట్ జట్టు కోచ్‌గా తిరిగి తీసుకురావాలని బీసీసీఐ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
రవిశాస్త్రి కోచింగ్‌లో భారత్ టెస్ట్ క్రికెట్‌లో అద్భుత విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియాలో వరుసగా టెస్ట్ సిరీస్ విజయాలు, విదేశీ గడ్డపై దూకుడైన ఆటతీరుతో రవిశాస్త్రి–విరాట్ కోహ్లీ కాంబినేషన్ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ నేపధ్యంలోనే మరోసారి ఆ జోడీని తీసుకురావాలన్న ఆలోచన బీసీసీఐలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో రవిశాస్త్రి ఓ షరతు పెట్టాడని సమాచారం. విరాట్ కోహ్లీని మళ్లీ టెస్ట్ జట్టులోకి తీసుకురావాలని, అతడిని కెప్టెన్‌గా నియమిస్తేనే.. తాను కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని బీసీసీఐకి చెప్పాడట. కోహ్లీ కెప్టెన్సీ లేకుండా తాను ఈ బాధ్యత చేపట్టబోనని స్పష్టంగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించనున్న ఫుట్‌బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ప్రస్తుతం వన్డే జట్టులో సీనియర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టీ20, టెస్టులకు అతడు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. విరాట్ నాయకత్వంలో టీమిండియా చూపిన దూకుడు, ఫిట్‌నెస్ సంస్కృతి, విదేశీ విజయాలు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో చెరగని ముద్రగా ఉన్నాయి. అందుకే మళ్లీ కోహ్లీని టెస్టుల్లో చూడాలనే డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. అయితే ఒకసారి రిటైర్ అయ్యాక రీఎంట్రీ ఇచ్చేడి లేదని కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. సో రవిశాస్త్రి రీఎంట్రీ కూడా అసాధ్యమనే చెప్పాలి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో భారత్ టెస్టుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..