CSK vs RR: రాజస్థాన్ డబుల్ ధమాకా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన రాజస్థాన్ రాయల్స్ ‘డబుల్ ధమాకా’ కొట్టింది. తొలుత చెన్నైని 150 పరుగులకే కట్టడి చేసి ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకున్న రాజస్థాన్.. ఆ తర్వాత విజయం సాధించి, పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకి.. ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్ ఓడినా, మరో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే! లక్నో సూపర్ జెయింట్స్ కూడా 18 పాయింట్లు సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌తో రాజస్థాన్ (0.298) రెండో స్థానాన్ని దక్కించుకుంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన చెన్నై జట్టు, బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్స్‌లో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మోయిన్ అలీ ఒక్కడే 93 పరుగులతో చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్స్‌కు ముచ్చెమటలు పట్టించారు. మిగతా బ్యాట్స్మన్లు కనీసం పోరాటపటిమ కూడా చూపించలేదు. కెప్టెన్ ధోనీ (26) కాస్త పర్వాలేదనిపిస్తే, మిగిలిన వాళ్ళందరూ వచ్చినట్టే వచ్చి, పెవిలియన్ చేరారు. రాజస్థాన్ తరఫున ఒక వికెట్ తీసుకొని ట్రెండ్ బౌల్ట్ ఒక్కడే భారీ పరుగులు (44) సమర్పించుకోగా, ఇతర బౌలర్లు బాగానే కంట్రోల్ చేశారు. చాహల్, మెక్‌కాయ్ చెరో రెండు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు.
Also Read
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. శుభారంభాన్నే ఇచ్చింది. జాస్ బట్లర్ 2 పరుగులకే ఔట్ అవ్వగా.. యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 59 పరుగులు) బాగానే రాణించాడు. సంజూ శాంసన్ (20 బంతుల్లో 15 పరుగులు) కాసేపు క్రీజులో కుదురుకొని, అతనితో మంచి భాగస్వామ్యం జోడించాడు. అయితే, పవర్ ప్లే తర్వాత రాజస్థాన్ నెమ్మదించింది. వరుసగా శాంసన్, పడిక్కల్ వికెట్లు పడడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. యశస్వి, అశ్విన్ కాసేపు కుదురుగా రాణించారు. యశస్వి ఔటవ్వడం, హెట్‌మెయర్ కూడా వెనుదిరగడంతో.. ఇక రాజస్థాన్ గెలుపు కష్టమేనని అనిపించింది. అప్పుడు అశ్విన్ విజృంభించి, రెండు బంతులు మిగిలుండగానే జట్టుని గెలిపించాడు.
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!