PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
- డెన్మార్క్ క్రీడాకారిణిపై వరుస గేమ్‌లలో విజయం
- 21-12, 21-14 తేడాతో ఫైనల్లో సింధు గెలుపు
- హైలో ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు
- రూ.30 లక్షలకు పైగా ప్రైజ్‌మనీ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీలోని సార్‌బ్రుకెన్ వేదికగా జరిగిన ‘హైలో ఓపెన్ 2026’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో డెన్మార్క్‌కు చెందిన లైన్ కేర్స్ఫెల్ట్ను 21-12, 21-14 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో హైలో ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు పుటలకెక్కింది. గతంలో పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు టైటిళ్లు లభించినప్పటికీ, మహిళల సింగిల్స్‌లో స్వర్ణం సాధించిన ఘనత మాత్రం సింధుకే దక్కింది.
మ్యాచ్ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, ప్రత్యర్థి కేర్స్ఫెల్ట్కు కోర్టులో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మొదటి గేమ్‌లో 11-8 ఆధిక్యంతో బ్రేక్‌కు వెళ్లిన సింధు, ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించి 21-12తో సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ అదే వేగాన్ని కొనసాగిస్తూ పవర్ ఫుల్ స్మాష్‌లు, పక్కా డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి 21-14తో మ్యాచ్‌ను ముగించింది. ఈ ఘనవిజయంతో సింధు సుమారు 35,000 అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 30 లక్షలకు పైగా) ప్రైజ్ మనీని అందుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత యువ ఆటగాడు లక్ష్య సేన్, ఇండోనేషియాకు చెందిన స్టార్ ప్లేయర్ జోనాథన్ క్రిస్టీతో టైటిల్ పోరులో తలపడనుండటంతో టోర్నీలో డబుల్ ధమాకా విజయంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
Also Read
- Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
- Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
- Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
తాజావార్తలు
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..