PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్‌గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL 2026 Final: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఫైనల్లో పెషావర్ జల్మీ అద్భుత విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్‌ను ముద్దాడింది. ఆదివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన తుది పోరులో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి బాబర్ ఆజం సేన ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్‌గా బాబర్‌కు ఇది తొలి పీఎస్ఎల్ ట్రోఫీ. ఈ మ్యాచ్ అనంతరం మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంటున్నప్పుడు బాబర్ ముఖంలో అమితమైన ఆనందం కనిపించింది.
ఈ విజయంలో ఆరోన్ హార్డీ అసలైన హీరోగా నిలిచాడు. తొలుత బౌలింగ్‌లో 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి హైదరాబాద్ కింగ్స్‌మెన్ నడ్డి విరిచాడు. దీంతో హైదరాబాద్ జట్టు 18 ఓవర్లలో కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. సయీమ్ అయూబ్ (54) ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్లు విఫలమవ్వడం ఆ జట్టును దెబ్బతీసింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో పెషావర్ ఆరంభంలోనే తడబడింది. కెప్టెన్ బాబర్ ఆజం ‘గోల్డెన్ డక్’ (తొలి బంతికే అవుట్)గా వెనుదిరగగా.. మొహమ్మద్ హారిస్, కుసాల్ మెండిస్, మైకేల్ బ్రేస్‌వెల్ సైతం స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. ఒక దశలో పెషావర్ 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ క్లిష్ట సమయంలో హార్డీ మళ్ళీ బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. 39 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసి, అబ్దుల్ సమద్ (48)తో కలిసి 85 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌తో పెషావర్ జల్మీ కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్ మొత్తం కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిన పెషావర్, అత్యంత ఆధిపత్యం ప్రదర్శించిన జట్టుగా నిలిచింది. బాబర్ ఆజం ఈ సీజన్లో 588 పరుగులు చేసి ఫఖర్ జమాన్ రికార్డును సమం చేయడంతో పాటు ‘ఆరెంజ్ క్యాప్’ను కూడా దక్కించుకున్నాడు.
Also Read
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
- Ind Vs Ned: పసికూన నెదర్లాండ్‌పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
పీఎస్ఎల్ 11 అవార్డుల వివరాలు:
విజేత: పెషావర్ జల్మీ (రెండో టైటిల్)
రన్నరప్: హైదరాబాద్ కింగ్స్‌మెన్ (తొలి సీజన్లోనే ఫైనల్ చేరిన జట్టు)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్): ఆరోన్ హార్డీ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: సుఫియాన్ ముఖీమ్ (పెషావర్ జల్మీ) – 22 వికెట్లు
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): బాబర్ ఆజం – 588 పరుగులు
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): సుఫియాన్ ముఖీమ్ – 22 వికెట్లు
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!