Site icon NTV Telugu

Asia Cup 2022: పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే..?

Team India

Team India

Asia Cup 2022: దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 పరుగులకు అవుటయ్యాడు. ఓపెనర్ రిజ్వాన్ (43) నిలబడ్డా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. వరుస విరామాల్లో పాకిస్థాన్ వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ నత్తనడకన నడిచింది. చివర్లో టెయిలెండర్ దహానీ రెండు సిక్సర్లు కొట్టడంతో ఆ జట్టు 147 పరుగులు చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమిండియా 148 పరుగులు చేయాలి.

Read Also: IND Vs PAK: టాస్ గెలిచిన భారత్.. పంత్ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటు

భారత బౌలర్లలో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు 4 వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బ తీశాడు. హార్దిక్ పాండ్యా కూడా కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడు 3 వికెట్లతో రాణించాడు. అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా అవేష్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా పాకిస్థాన్ వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందా.. ఛేదిస్తే ఎన్ని వికెట్లు కోల్పోతుంది.. లేదా చతికిలపడుతుందా అనేది వేచి చూడాలి.

Exit mobile version