Pakistan Actor Sehar Shinwari: మెగా టోర్నీలు వస్తే చాలు.. టీమిండియాని ఓడిస్తే బట్టలు విప్పుతా, నగ్నంగా ఊరేగుతా, అతడ్ని పెళ్లి చేసుకుంటా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తానంటూ పాకిస్తాన్ భామలు స్టేట్మెంట్‌లు ఇస్తుంటారు. రాత్రికి రాత్రే ఫేమ్ పొందాలన్న ఉద్దేశంతో.. వాళ్లు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారని మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే.. కొన్నాళ్ల నుంచి ఆ సంస్కృతి కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్లీ మరో పాక్ భామ, ఆ సంచలనానికి నాంది పలికింది. బహుశా తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదేమో, అందుకే లేటెస్ట్‌గా ఒక షాకింగ్ కామెంట్ చేసింది.
టీ20 వరల్డ్‌కప్ సూపర్-12లో భాగంగా నవంబర్ 6వ తేదీన భారత్, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే.. ఆ దేశపు వ్యక్తిని తాను పెళ్లి చేసుకుంటానని పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ ట్వీట్ చేసింది. ఈ ఒక్క ట్వీట్‌తో ఆ పాక్ భామ రాత్రికి రాత్రే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అయితే.. భారత క్రీడాభిమానులు మాత్రం ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఎప్పుడూ ఇదే పనేనా? టీమిండియాపై అక్కసు వెళ్లగక్కడం తప్పం ఇంకేం పని లేదా? అసలు మీకు బోర్ కొట్టదా? అంటూ ఆ పాక్ నటిని విమర్శిస్తున్నారు. ఇలా సవాళ్లు చేసిన ప్రతీసారి మీ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయని, ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందంటూ ఆమెని ఏకిపారేస్తున్నారు. ఇదే సమయంలో.. జింబాబ్వే చేతిలో పాక్ ఓటమిని గుర్తు చేస్తూ, ఒక పరుగు తేడాతో ఓడిపోవడానికి తమదేమీ పాక్ జట్టు కాదని సెటైర్లు వేస్తున్నారు.
కాగా.. ఈ సెహర్ షిన్వారీ భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు టీమిండియాపై తన అక్కసు వెళ్లగక్కింది. బంగ్లాదేశ్, భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ సేన ఓడిపోవాలని పదే పదే కోరింది. అంతకుముందు.. స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కూడా ఈ అమ్మడు విమర్శలు గుప్పించింది.