The Law Of Wide Ball: క్రికెట్ లో జనరల్ గా వైడ్ బాల్ అంటే రిటర్న్ క్రీజ్ కు పెరలాల్ గా ఉండే ఒక వైట్ లైన్ పై నుండో లేదా లైన్ అవతల నుండి బాల్ వెళ్తే దాన్ని వైడ్ బాల్ అంటాం. ఈ వైడ్ క్రీజ్ అనేది మిడిల్ స్టంప్ నుండి 0.89 మీటర్స్ దూరంలో వికెట్ కు రెండు వైపుల ఉంటుంది. అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బ్యాట్స్మన్ యొక్క రీచ్ లో లేకపోతే ఈ వైడ్ లైన్ తో సంబంధం లేకుండా వైడ్ సిగ్నల్ ఇచ్చి బ్యాటింగ్ టీంకు ఒక ఎక్స్ట్రా రన్ ను అవార్డ్ చేస్తారు. సేమ్ అలాగే ఒకవేళ బాల్ అనేది బాట్స్మన్ రీచ్ లో గనుక ఉంటే అది వైడ్ లైన్ బయట నుండి వెళ్లిన దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. దీని గురించి ఇంకా డీప్ గా తెలుసుకుందాం.
ఫస్ట్ ఆఫ్ సైడ్ వైడ్ బాల్ గురించి మాట్లాడుకుంటే, ఒక బాట్స్మన్ బ్యాటింగ్ కు వచ్చి నార్మల్ బ్యాటింగ్ గార్డ్ ను తీసుకుని బ్యాటింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇక్కడ నార్మల్ బ్యాటింగ్ గార్డ్ అంటే మిడిల్ స్టంప్ లేదా లెగ్ అండ్ మిడిల్ స్టంప్ గార్డ్. ఇక ఇప్పుడు బౌలర్ వేసిన బాల్ బాట్స్మన్ కు దూరంగా ఆ వైడ్ లైన్ అవతల నుండి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ బాట్స్మన్ తన పోసిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటకు రాకుండా షాట్ ఆడితే అది అతని రీచ్ లో ఉండదు. దింతో అంపైర్ దాన్ని వైడ్ బాల్ గాసిగ్నల్ చేస్తాడు. అలా కాకుండా బాట్స్మన్ ఆ బాల్ ను కొట్టడం కోసం తన పోసిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటికి వచ్చి ఆ బాల్ ను తన రీచ్ లోకి తెచ్చుకుని షాట్ ఆడి మిస్ అయితే, అంపైర్ దాన్ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తాడు.
ఇక లెగ్ సైడ్ వైడ్ బాల్ విషయానికొస్తే MCC లిమిటెడ్ ఒవెర్స్ క్రికెట్ లో ఈ లెగ్ సైడ్ వైడ్ బాల్ కు మినహాయింప తీసుకొచ్చింది. ఎందుకంటే బాట్స్మన్ కు లెగ్ సైడ్ వైపు పెద్దగా రీచ్ ఉండదు. దింతో బాల్ అనేది బ్యాట్సమన్ నార్మల్ గార్డ్ పోసిషన్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెగ్ సైడ్ వైపు డ్రిఫ్ట్అయ్యి బాట్స్మన్ ను మిస్ అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బాట్స్మన్ రీచ్ లో లేదు కాబట్టి ఆ బాల్ ను అంపైర్ వైడ్ గా సిగ్నల్ చేస్తారు. అయితే బాట్స్మన్ ఇలాంటి బాల్ కు రివర్స్ స్వీప్ లేదా స్విచ్ హిట్ షాట్ ఆడితే మాత్రం ఆ బాల్ ను లీగల్ డెలివరీ గానే కన్సిడర్ చేస్తారు.
Also Read: Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు” కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా.. సంచలన ఆరోపణలు..
ఎందుకంటే బాట్స్మన్ ఆ బాల్ ను కావాలని తన రీచ్ లోకి తెచ్చుకున్నాడు. అలాగే లెగ్ సైడ్ వైపు బాల్ వచ్చినప్పుడు ఒకవేళ బాట్స్మన్ ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆ బాల్ ను మిస్ అయితే దాన్ని కూడా లీగల్ బాల్ గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మళ్ళి సేమ్ స్టోరీ. బాట్స్మన్ కావాలని ఆ బాల్ తన రీచ్ లో లేకుండా చేసుకున్నాడు. ఒకవేళ బాట్స్మన్ తను తీసుకున్న నార్మల్ బ్యాటింగ్ గార్డ్ పోసిషన్ లో ఉండే ఆ బాల్ ను ఆడి ఉంటె అది ఆతని ప్యాడ్స్ కు తగిలేది. సో బాట్స్మన్ కావాలనే ఆ బాల్ ను మిస్ చేసాడు కాబట్టి బౌలర్ ను పనిష్ చెయ్యరు.
సో ఇక నిన్నటి మ్యాచ్ లో మనం పరిశీలించినట్లు అయితే విరాట్ కోహ్లీ 97 రన్స్ దగ్గర బాటింగ్ చేస్తుండగా బాంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్ వేసిన బాల్ లీగల్ డెలివరీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆటైం లో కోహ్లీ కనుక ఆఫ్ సైడ్ వైపు జరగకుండా ఉన్నట్లయితే కచ్చితంగా ఆ బాల్ కోహ్లీ పాడ్స్ ని టచ్ ఐయేది. అందుకే అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఆ బాల్ ని లీగల్ బాల్ గానే కన్సిడర్ చేసారు.