ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్‌ను 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు నిర్వహించేందుకు తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. సౌతాఫ్రికా, జింబాబ్వే, మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని, జూలైలో ఎడిన్బర్గ్లో జరిగే ఐసీసీ వార్షిక సాధారణ సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
సౌతాఫ్రికాలోనే మెజారిటీ మ్యాచ్‌లు..
ఈ టోర్నీలో మొత్తం 54 మ్యాచ్‌లు జరగనుండగా, అందులో అత్యధికంగా 41 మ్యాచ్‌లకు సౌతాఫ్రికాలోని 8 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్, విక్టోరియా ఫాల్స్ వంటి 3 వేదికల్లో 8 నుండి 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన 3 మ్యాచ్‌లను నమీబియా నిర్వహించనుంది. జింబాబ్వేలో కొత్తగా నిర్మిస్తున్న ‘ఫేల్ మోసి-ఓ-తున్యా’ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వచ్చే ఏడాది మే నెలలో అధికారికంగా ప్రారంభం కానుంది. ఆఫ్రికా ఖండంలో 2003 తర్వాత జరుగుతున్న మొదటి పురుషుల వన్డే ప్రపంచకప్ ఇదే కావడం విశేషం.
Also Read
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
మారనున్న టోర్నీ ఫార్మాట్…
గత రెండు ప్రపంచకప్ ఎడిషన్లలో కేవలం 10 జట్లే పోటీపడగా, 2027 టోర్నీలో ఐసీసీ మళ్లీ పాత 14 జట్ల ఫార్మాట్‌ను తీసుకువస్తోంది. ఈ 14 జట్లను తలా ఏడు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు, ఐసీసీ పూర్తి స్థాయి సభ్యులైనందున సౌతాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధించగా, నమీబియా మాత్రం క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడి రావాల్సి ఉంటుంది. 2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) కింద జరిగే మొదటి ఐసీసీ ఈవెంట్ ఇదే కానుంది. రాబోయే రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) విస్తరణ, ఫార్మాట్ మార్పులపై కూడా హాంకాంగ్‌లో జరిగే ఐసీసీ సమావేశాల్లో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!