విశాఖపట్నం ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ , డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సీఫెర్ట్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను మొత్తం 36 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో డారిల్ మిచెల్ 18 బంతుల్లోనే 39 పరుగులు చేయడంతో కివీస్ స్కోరు 215కు చేరింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Jaya Ekadashi 2026: జయ ఏకాదశి ఎప్పుడు? తిథి, ముహూర్తం, విశిష్టత పూర్తి వివరాలు ఇవే.!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆరో నంబర్‌లో వచ్చిన శివమ్ దూబే (65 పరుగులు – 23 బంతులు) తన మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. దూబే కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించాడు. కానీ 15వ ఓవర్‌లో మ్యాట్ హెన్రీ వేసిన బంతి బ్యాట్‌కు తగిలి బౌలర్ ఎండ్‌లోని స్టంప్స్‌ను తాకడంతో దూబే దురదృష్టవశాత్తూ ‘రన్ అవుట్’ అయ్యాడు. అక్కడితో భారత్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. దూబే అవుట్ అయిన తర్వాత భారత లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. మిచెల్ సాంట్నర్ తన స్పిన్ మాయాజాలంతో హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తీసి భారత్ పతనానికి కారణమయ్యాడు. సాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా, జాకబ్ డఫ్ఫీ చివరలో కుల్‌దీప్ యాదవ్‌ను అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ను 165 పరుగుల వద్ద ముగించాడు.
