Team India: అతడు కేఎల్ రాహుల్ వారసుడు.. గిల్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నాడు. అయినా కేఎల్ రాహుల్ ఆటను అచ్చుగుద్దినట్లు ఓ ఆటగాడు దింపేశాడని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అతడు ఎవరో కాదు శుభ్‌మన్ గిల్. శ్రీలంకతో టీ20 సిరీస్‌తోనే గిల్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే అతడు టీ20 తరహాలో ఆడకుండా జిడ్డు బ్యాటింగ్ చేశాడని నెటిజన్‌లు మండిపడుతున్నారు. వన్డే, టెస్టుల్లో రాణిస్తున్న శుభ్‌మన్ గిల్‌ను టీ20ల్లోకి తీసుకుంటే చెత్త బ్యాటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20ల్లో గిల్ ఘోరంగా విఫలమయ్యాడని.. నిర్ణయాత్మక మూడో టీ20లో కూడా జిడ్డు బ్యాటింగ్ చేసి విసుగు తెప్పించాడని భావిస్తున్నారు. తను ఆడుతున్నది టీ20 మ్యాచ్ అనే విషయం గిల్ మరిచిపోయాడని ఆరోపిస్తున్నారు.
Read Also: India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇండియా..
Also Read
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
- Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్‌న్యూస్‌తో పాటు బ్యాడ్‌న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
- IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్‌లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న రాజ్‌కోట్ పిచ్‌పై ఆడుతూ.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను గిల్ మెయిడెన్ ఆడాడని నెటిజన్‌లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో కేఎల్ రాహుల్ వారసుడు అంటూ అభివర్ణిస్తున్నారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ కూడా నెమ్మదిగా ఆడి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు అదే తరహాలో గిల్ బ్యాటింగ్ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దీంతో కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌కు పనికిరాడని చెప్పి అతడి వారసుడిని తీసుకున్నారా అంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. కాగా రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్, సూర్యకుమార్ అద్భుతమైన ఆట, అక్షర్ పటేల్ నిలకడ కలిసి శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా విజయాన్ని కట్టబెట్టాయని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!