నాటింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును అద్భుత రీతిలో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 299 పరుగుల లక్ష్యాన్ని కేవలం 50 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఛేదించింది. దీన్ని బట్టి ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెయిర్‌స్టో టీ20 మ్యాచ్ తరహాలో ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో కొండంత లక్ష్యం కర్పూరంలా కరిగిపోయింది.
93 పరుగులకే నాలుగు వికెట్లు పడినా బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ ఇద్దరూ అదిరిపోయే రీతిలో ఆడారు. బెయిర్‌స్టో (136; 92 బంతుల్లో 14×4, 7×6), బెన్ స్టోక్స్ (75 నాటౌట్; 70 బంతుల్లో 10×4, 4×6) బ్యాటింగ్ కారణంగా ఓడిపోతుందనుకున్న ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి కివీస్‌కు ఖేదాన్ని మిగిల్చింది. బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ ఐదో వికెట్‌కు అజేయంగా 179 పరుగులు జోడించడం విశేషం. కాగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 539 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 284 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఇంగ్లండ్ ముందు 299 పరుగుల లక్ష్యం నిలిచింది.
IPL Media Rights: టీవీ హక్కులు ‘స్టార్’కు.. డిజిటల్ హక్కులు ‘రిలయన్స్’కు