Samantha: నాగ చైతన్య ప్లేస్ ను అతనితో రీప్లేస్ చేస్తున్న సమంత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెల్సిందే. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కోసం ఆమె కష్టపడుతుంది. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో ఖుషీ సినిమా చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ పై సామ్ భారీ అంచనాలను పెట్టుకుంది. ఈ మధ్యనే ఆమె నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్ టాక్ అందుకుంది. ఎలాగైనా ఈసారి ఈ రెండు ప్రాజెక్ట్స్ తో ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ హిట్టుకొట్టాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ తరువాత సామ్.. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఓ బేబీ మంచి హిట్ ను అందుకుంది. ఆ సమయంలోనే నాగ చైతన్య, సమంత లకు నందిని ఒక కథను వినిపించడం.. వారు ఓకే చేయడం జరిగాయి. కానీ, ఆ జంట విడాకులు తీసుకోవడంతో ఆ ప్రాజెక్ట్ మరుగున పడింది.
K. Vasu: ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి మొదటి సినిమా డైరెక్టర్ మృతి..
Also Read
ఇక మొన్ననే అన్ని మంచి శకునములే అంటూ నందిన ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో నందిని సైతం.. సామ్ నే నమ్ముకుంది. అందుకే ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సిద్దమయ్యింది. ఇక సమంత ఓకే కానీ, హీరోగా చై ప్లేస్ ను రిప్లేస్ చేసే హీరోను వెతుకుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. నాగ చైతన్య ప్లేస్ ను డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డతో రీప్లేస్ చేయాలనీ చూస్తున్నారట. దీనికి సామ్ కూడా అంగీకరించిందని టాక్. ఇక ఈ సినిమాకు bvs రవి కథ అందింస్తుండగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. నందిని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్టే. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన రిలీజ్ చేయనున్నారట. మరి ఈ సినిమాతో ఓ బేబీ కాంబో హిట్ అందుకుంటుందా..? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!