MS Dhoni Political Entry: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే అతడు ఆడుతున్నప్పటికి ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గటం లేదు. ధోని సారథ్యంలోనే టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మూడు కప్పుల్ని సాధించిన ఒకే ఒక్కడు ధోనీ. అయితే, ప్రస్తుతం మహేంద్రుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? అనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతుంది.
Read Also: Gadikota Srikanth Reddy: సీఎం పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది..
అయితే, గతంలో ఎంఎస్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ పుకార్లు బాగానే వచ్చాయి.. కానీ, అతడి రాజకీయ అరంగేట్రంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతడి వ్యక్తిగతం అన్నారు. అయితే, బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకున్నాను.. ఎంఎస్ ధోనీ రాజకీయాల్లో కూడా బాగా రాణించగలడు.. వస్తే ఈజీగా గెలుస్తాడు.. ఎందుకంటే, అతనికి మంచి ప్రజాదరణ ఉందన్నాడు రాజీవ్ శుక్లా.
Read Also: Crime: ప్రియుడి కోసం పారిపోయిన 13 ఏళ్ల బాలిక.. అమ్మాయిపై పోలీస్ అత్యాచారం..
ఇక, మహేంద్ర సింగ్ ధోనీతో జరిగిన పాత సంభాషణను ఈ సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గుర్తుకు చేసుకున్నాడు. ఒకసారి ధోనీ ఓ జాతీయ పార్టీలో చేరి.. దాని తరపున లోక్‌సభ స్థానానికి పోటీ చేయబోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి.. ఆ విషయాన్ని అతడిని చెప్తే.. అది కేవలం అసత్య ప్రచారం మాత్రమే అని ధోనీ కొట్టిపారేశారని రాజీవ్ శుక్లా వెల్లడించారు.