Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami on 2027 ODI World Cup Plans: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌లో ఆడటంపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశాడు. తన ఆటపై దృష్టి పెట్టడం, ఫిట్నెస్ కాపాడుకోవడం, మంచి రిథమ్‌లో కొనసాగడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. జాతీయ జట్టులో ఎంపిక విషయంలో సెలెక్టర్లు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. షమీ ఇటీవల టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే చివరిది. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 2/122, 2/39 గణాంకాలు నమోదు చేశాడు.
ముంబైలో మీడియాతో మాట్లాడిన మహమ్మద్ షమీ.. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్ తన ఆలోచనల్లో ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ‘ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాను. ప్రస్తుతం నా ఆటపైనే దృష్టి పెడుతున్నాను. సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచికే అవుతుంది. నా వైపు నుంచి చేయాల్సిందల్లా ఆటను కొనసాగించడం, మంచి రిథమ్‌లో ఉండటం, కనీసం రాష్ట్ర జట్టు, ఐపీఎల్ తరఫున అయినా క్రికెట్ ఆడుతుండటం’ అని షమీ చెప్పాడు. దేశవాళీ క్రికెట్ ఆడటానికి తనకు ప్రేరణ ఏమిటో కూడా షమీ వివరించాడు. క్రికెట్‌పై ఇష్టం, ఆటను ఆస్వాదించడం తనను ఇంకా మైదానంలో కొనసాగిస్తున్నాయని తెలిపాడు.
Also Read
- Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
- Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
- India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీలంక
- Sri Lanka Captain: వారి వల్లే విజయం సాధ్యమైంది.. శ్రీలంక కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచడం కూడా ఎంతో సంతృప్తినిస్తుందని షమీ చెప్పాడు. ‘మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉన్నంతకాలం, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం ఆడుతూనే ఉండాలి. నా ప్రేరణ కూడా అదే. రాష్ట్ర జట్టు తరఫున ఆడుతున్నప్పుడు యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా నేర్చుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది?. అనుభవం చాలా ముఖ్యం. ఏ స్థాయిలో ఆడుతున్నా సరే.. మనకు తెలిసిన విషయాల్లో కొంతైనా యువ ఆటగాళ్లకు నేర్పించాలి’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో పాల్గొనడాన్ని రిటైర్మెంట్తో ముడిపెట్టవద్దని షమీ స్పష్టం చేశాడు. తాను వైట్‌బాల్ క్రికెట్‌ను కొనసాగిస్తానని, అవసరమైతే ఫిట్నెస్ కోసం రెడ్‌బాల్ క్రికెట్ కూడా ఆడతానని తెలిపాడు. గత 15 నుంచి 20 ఏళ్లుగా తాను అనుసరిస్తున్న విధానమే ఇప్పటికీ కొనసాగిస్తున్నానని వివరించాడు.
టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై కూడా షమీ స్పందించాడు. శరీరంపై ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు, తన కెరీర్‌కు ఏది మంచిదో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ‘నాకు అది సరైన నిర్ణయంగా అనిపించింది. అందుకే రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రస్తుతం బాగా కదలగలుగుతున్నాను, బాగా ఆడుతున్నాను. కాబట్టి వైట్‌బాల్ క్రికెట్‌ను స్వేచ్ఛగా ఆస్వాదిస్తాను. శరీరంపై మరీ ఎక్కువ భారం వేయడం మంచిది కాదు’ అని పేర్కొన్నాడు. ఇటీవలే షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013 నవంబర్ 6న వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. సరిగ్గా అదే తేదీన 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. భారత్ తరఫున 64 టెస్టులు ఆడిన షమీ 122 ఇన్నింగ్స్‌ల్లో 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/56. టెస్టుల్లో 12 సార్లు నాలుగు వికెట్లు, ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
తాజావార్తలు
-
Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
-
HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
-
Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!
ట్రెండింగ్
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..