Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- మహ్మద్ ఆమీర్‌కు బ్రిటిష్ పౌరసత్వం..?
- యూకే పాస్‌పోర్టు పొందిన పాక్ క్రికెటర్..
- ఐపీఎల్లో ఆడే ఛాన్స్ వస్తుందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Amir: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ మహమ్మద్ ఆమీర్ బ్రిటీష్ పౌరుడిగా మారినట్లు తెలుస్తోంది. ఆమీర్‌కు యునైటెడ్ కింగ్డమ్ పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమీర్ భార్య నర్గీస్ ఖాన్ బ్రిటీష్ పౌరురాలు. దీంతో ఆయన కూడా కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అతడికి తాజాగా యూకే పాస్‌పోర్టు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్‌గా ఉన్న అమీర్, ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందనే అనే ప్రశ్నలు ఉత్పన్నతమవుతున్నాయి. నిజానికి 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్లో మాత్రమే పాక్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. ఆ తర్వాత పాకిస్తాన్లో జన్మించిన అజహర్ మహమూద్ మాత్రమే 2012 నుంచి 2015 మధ్య ఐపీఎల్ ఆడాడు. ఇతను కూడా బ్రిటిష్ పాస్‌పోర్టు పొందిన తర్వాతే ఐపీఎల్లో ఇంగ్లీష్ ప్లేయర్‌గా 23 మ్యాచ్‌లు ఆడారు.
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమీర్ ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. ఆమీర్ ఇప్పుడు విదేశీ ఆటగాళ్ల విభాగంలో వేలం కోసం తన పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇంగ్లాండ్ పౌరసత్వం పొందినంత మాత్రాన ఆయన ఐపీఎల్లో ఆడే అవకాశం రాదు. కౌంటీ క్రికెట్ నియమాల ప్రకారం.. కేవలం బ్రిటిష్ పౌరుడైతే సరిపోదు, ఒక ఆటగాడు గత 12 నెలల్లో ఇంగ్లాండ్ బయట ఉన్న పూర్తి సభ్యదేశం తరుఫున ప్రొపెషనల్ క్రికెట్ ఆడి ఉండకూడదు. కానీ ఆమీర్ పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో రావల్పిండి తరుపున ఆడారు. దీంతో, యూకే పాస్‌పోర్ట్ పొందిన వెంటనే అతడికి ఇంగ్లాండ్‌లో స్థానిక హోదా లభించదు.
ఆమిర్ 2024 డిసెంబర్లో రెండవసారి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అతను పాకిస్థాన్ తరపున 36 టెస్టులు, 61 వన్డేలు, మరియు 62 టీ20లు ఆడాడు. అతను 2017 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన పాకిస్థాన్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్లో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌ల వికెట్లు తీసి అతను మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. 34 ఏళ్ల ఆమిర్, జనవరి 2025 నుంచి 59 టీ20 మ్యాచ్‌లు ఆడి, 22.88 సగటుతో, 8.19 ఎకానమీతో 75 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!