ఈ నెల 24న జరగనున్న భారత్ – పాక్ పోరు నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలతో లోయ దద్దరిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదని అథవాలే పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్ ఆదేశం పై యుద్దం ప్రకటించాలి. జమ్మూ కాశ్మీర్‌లో వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదు” అని చెప్పారు. కాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.