Kolkata Knight Riders Scored 88 In First 10 Overs: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! తొలుత బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్.. ఆర్సీబీ బౌలర్లను రప్ఫాడించేస్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి.. రెండు వికెట్ల నష్టానికి కేకేఆర్ 88 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించడం వల్లే.. కేకేఆర్ స్కోరు ఇలా పరుగులు పెడుతోంది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే అతడు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 22 బంతుల్లోనే జేసన్ తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడంటే.. అతనెలా విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి.
Pakistan: భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని వణుకుతున్న పాకిస్తాన్..

రాయ్‌తో పాటు వచ్చిన జగదీశన్ (27) నిదానంగా ఇన్నింగ్స్ ఆడుతుండగా.. జేసన్ రాయ్ మాత్రం పరుగుల వర్షం కురిపించాడు. ఇక జగదీశన్ కూడా చెలరేగి ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. 10వ ఓవర్‌లో విజయ్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోతే.. అది బౌండరీ లైన్‌లో ఉన్న ఫీల్డర్ చేతిలోకి నేరుగా వెళ్లింది. అదే ఓవర్‌లోనే జేసన్ రాయ్ కూడా ఔట్ అయ్యాడు. స్టంప్స్ వదిలి లెగ్ సెడ్ కొట్టాలని చూడగా.. బాల్ నేరుగా వికెట్లకు తాకింది. విజయ్ కుమార్ తెలివిగా యార్కర్ బాల్ వేయడంతో.. జేసన్ రాయ్ (56) పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం క్రీజులో వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రానా ఉన్నారు. మరి.. జేసన్ విధ్వంసాన్ని వీళ్లు కంటిన్యూ చేస్తారా? మరో 10 ఓవర్లలో ఎంత మేర స్కోరు రాణిస్తారు? వేచి చూడాల్సిందే!