Kolkata Knight Riders Scored 79 In 10 Overs: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రెహమానుల్లా గుర్బాజ్ అర్థశతకంతో చెలరేగడంతో.. కేకేఆర్ స్కోరు బోర్డు ముందుకు సాగుతోంది. తొలుత మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే కేకేఆర్‌కు అనూహ్య షాక్‌లు తగిలాయి. నాలుగో ఓవర్‌లోనే కేకేఆర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్, మన్‌దీప్ సింగ్ బౌల్డ్ అయ్యారు. అనంతరం కేకేఆర్ కెప్టెన్ కూడా ఏడో ఓవర్‌లో పెవిలియన్ చేరాడు.
KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఆర్సీబీ
ఇలా కేకేఆర్ ఓవైపు వికెట్లు కోల్పోతుండగా.. మరోవైపు గుర్బాజ్ ఒత్తిడికి గురవ్వకుండా, ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. విశేషం ఏమిటంటే.. 47 పరుగుల వద్ద ఇతడు సిక్సర్ బాది, తన అర్థశతకాన్ని పూర్తి చేసుకోవడం. సాధారణంగా హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉన్నప్పుడు చాలామంది ఆటగాళ్లు తడబడతారు. తమ అర్థశతకం పూర్తి చేసుకోవడంలో దృష్టి సారిస్తారు. కానీ.. గుర్బాజ్ మాత్రం సిక్స్ కొట్టి, తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇతడు అద్భుతంగా రాణిస్తుండడం వల్ల.. కష్టాల్లో ఉన్న కేకేఆర్ గట్టెక్కిందని చెప్పుకోవచ్చు.
Japanese military helicopter: జపాన్ సైనిక హెలికాప్టర్ అదృశ్యం.. వారంతా క్షేమమేనా?