KL Rahul To Be Replaced By Shubman Gill: గతేడాది నుంచి కేఎల్ రాహుల్ ఎంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ‘ఈ మ్యాచ్‌లో తప్పకుండా రాణిస్తాడు’ అని అంచనాలు పెట్టుకున్న ప్రతీసారి రాహుల్ నిరాశపరుస్తూనే ఉన్నాడు. ‘ఇప్పుడు అతడ్ని జట్టులో నుంచి తొలగించండి’ అని ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు సైతం డిమాండ్ చేసేంత పరిస్థితికి దిగజారిపోయాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అతని వద్ద నుంచి వైస్ కెప్టెన్ ట్యాగ్‌ని లాగేసుకుంది. ఇప్పుడు తాజాగా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాతో జరగబోయే మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లకు అతడ్ని బెంచ్‌కే పరిమితం చేయొచ్చు. అతని స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
IND vs AUS: ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ.. ఇంకో వికెట్ డౌన్
ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘బోర్డుతో పాటు జట్టు మెనెజ్‌మెంట్ ఎప్పుడూ కేఎల్ రాహుల్‌కు మద్దతుగా ఉంటుంది. కానీ.. ఇప్పుడు జట్టులో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అతడు విదేశీ టెస్టుల్లో బాగానే రాణించాడు కానీ, ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. ఇదే సమయంలో రాహుల్‌కి యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అయితే.. తొలి రెండు టెస్ట్ మ్యాచెస్‌లో భారత్ విజయం సాధించింది కాబట్టి, మిగిలిన రెండు టెస్టులకు కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేయడం జరిగింది. లేకపోతే.. కొన్ని మార్పులు చేసేవాళ్లం. ఏదేమైనా.. ఇండోర్‌లో ఆసీస్‌తో జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన.. రాహుల్ స్థానంలో శుభ్‌మన్‌ని తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట!
S*X with Car : సెక్స్ విత్ కార్.. మనుషులు దొరకడం లేదంట..!
ఇదిలావుండగా.. గతేడాది నుంచి కేఎల్ రాహుల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, అత్యంత దారుణంగా ఉంది. పరిమిత ఓవర్లలో కాస్త పర్వాలేదనిపించాడు కానీ, టెస్టుల్లోనే పరిస్థితి ఘోరంగా ఉంది. గత పది ఇన్నింగ్స్‌లలో అతడు ఒక్కసారి కూడా 30 పరుగుల మార్క్‌ని దాటలేకపోయాడు. గత 10 ఇన్నింగ్స్‌లలో 13.57 సగటున అతడు చేసింది కేవలం 123 పరుగులే! ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతని ప్రదర్శనపై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.