KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. వెల్లింగ్టన్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి గిల్ సేన 486/4 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 290 బంతుల్లో 136 పరుగులు చేసి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. ఈ సందర్భంగా తన సెంచరీ వెనుక ఉన్న కష్టాన్ని రాహుల్ వెల్లడించాడు.
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్.. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడమే తన సెంచరీ వెనుక అసలు రహస్యం అని చెప్పాడు. ‘భారత్-ఏ తరఫున ఆడిన అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయా. అయితే ఆ ప్రదర్శనలతో నిరాశ చెందకుండా నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశా. పరిస్థితులకు అనుగుణంగా నా బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నా. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలనే విషయంలో ముందుగానే స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగాను. సెంచరీ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రాహుల్ తెలిపాడు.
Also Read
- Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
- Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
- Kaviya Maran: తన ఉద్యోగులకు ఆరెంజ్ ఆర్మీ క్వీన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. పెళ్లి కానుక బాక్స్ వీడియోలు వైరల్..
- Devdutt Padikkal: భారత్ కష్టాల్లో పడేది.. మా టార్గెట్ అదే.. పడిక్కల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తన వికెట్ విషయంలో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ రివ్యూ తీసుకోకపోవడంపై కేఎల్ రాహుల్ సరదాగా స్పందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫిలిప్స్‌కు కొన్ని డ్రింక్స్ కొనిస్తానని చమత్కరించాడు. ఆ సమయంలో రివ్యూ తీసుకుంటారేమోనని ఎదురుచూస్తూ గడిపిన 15 సెకన్లు తన జీవితంలోనే అత్యంత నెమ్మదిగా గడిచాయని చెప్పాడు. ఫిలిప్స్ మనసు మార్చుకుని రివ్యూ తీసుకోకూడదని తాను ఆశించినట్లు నవ్వుతూ వెల్లడించాడు. భారత్ ఇన్నింగ్స్‌లోని 7వ ఓవర్లో 5 పరుగుల వద్ద రాహుల్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి బయటపడ్డాడు. ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూను తేలికగా తీసుకోవడంతో.. న్యూజిలాండ్ రివ్యూ తీసుకోలేదు.
ఇక ఈ సెంచరీతో లోకేష్ రాహుల్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. SENA దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో టెస్టు సెంచరీలు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ నాలుగు దేశాల్లోనూ టెస్టు శతకాలు నమోదు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 13 సెంచరీలు సాధించిన రాహుల్.. అందులో ఎనిమిది శతకాలను SENA దేశాల్లోనే నమోదు చేయడం విశేషం.
తాజావార్తలు
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!