Kane Williamson: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి కేన్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kane Williamson Ruled Out Of IPl 2023 Due To Knee Injury: ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్నామన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే.. గుజరాత్ టైటాన్స్‌కి ఓ భారీ దెబ్బ తగిలింది. అత్యంత కీలక ఆటగాడైనా కేన్ విలియమ్సన్.. గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శుక్రవారం (మార్చి 31వ తేదీన) రాత్రి చెన్నై ఇన్నింగ్స్‌లో భాగంగా.. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్స్‌ని ఆపే ప్రయత్నంలో, బౌండరీ లైన్ వద్ద కేన్ విలియమ్సన్ డైవ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతని మోకాలికి తీవ్ర గాయమైంది. ఆ గాయం నొప్పితో అతడు విలవిల్లాడటంతో.. నడవలేకపోయాడు. దీంతో.. అతడ్ని సిబ్బంది తమ భుజాలపై ఎత్తుకొని వెళ్లింది. అతడు ఆడే పరిస్థితిలో లేకపోవడంతో.. అతని స్థానంలో సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దింపారు.
Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
కేన్ విలియమ్సన్‌కి గాయం అయినప్పుడే.. అందరికీ అనుమానాలు వచ్చాయి. ఒకవేళ ఇది తీవ్రమైతే.. అతడు ఈ సీజన్ నుంచి వైదొలగొచ్చని భావించారు. మరికొందరు మాత్రం.. తదుపరి మ్యాచ్‌కల్లా కేన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. అందరూ అనుమానించిందే నిజం అయ్యింది. వైద్య పరీక్షల తర్వాత కేన్‌కి తగిలిన గాయం తీవ్రమైందని తేలింది. అతని మోకాలికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీన్నుంచి కోలుకోవాలంటే.. కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విశ్రాంతి అవసరం. ఈ తరుణంలోనే కేన్ ఈ ఐపీఎల్ సీజన్‌కి దూరం కానున్నాడు. ఈ విషయంపై గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మాట్లాడుతూ.. కేన్ మోకాలికి తీవ్రమైన గాయమైందని, అతడు తర్వాతి మ్యాచుల్లో ఆడే పరిస్థితి కష్టమేనని బాంబ్ పేల్చాడు. ఎంతో అనుభవజ్ఞుడైన కేన్, గాయం కారణంగా ఇలా దూరమవ్వడంతో.. గుజరాత్ టైటాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
KKR vs PBKS : ముగిసిన పంజాబ్ బ్యాటింగ్.. కోల్‌కతా టార్గెట్ 192
ఇక గుజరాత్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గౌక్వాడ్ 92 పరుగులతో తాండవం చేయడంతో.. చెన్నై ఆ స్కోరు చేయగలిగింది. ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే 182 పరుగులు చేసి, ఆ లక్ష్యాన్ని ఛేధించింది. శుభ్మన్ గిల్ అర్థశతకంతో రాణించగా.. మిగిలిన ఆటగాళ్లు కూడా తమవంతు కృషి చేయడంతో.. గుజరాత్ సునాయాసంగా చెన్నైని ఓడించగలిగింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!