T20 World Cup: 2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత నేపథ్యంలో భారత్, బంగ్లాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ టీమ్ కేకేఆర్ నుంచి డ్రాప్ చేయడంపై బంగ్లా బోర్డు ఆగ్రహంతో ఉంది. దీంతో భారత్‌లో ఆడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని బంగ్లాదేశ్ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి తాము ఆడే అన్ని T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్( BCB) ఐసీసీని కోరింది.
Read Also: Bhatti Vikramarka: ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా?.. ఆ ఛానెల్ కథనంపై భట్టి విక్రమార్క ఫైర్..
ఇదిలా ఉంటే, ఐసీసీతో శనివారం జరిగిన మీటింగ్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కీలక ప్రతిపాదన చేసింది. తమ గ్రూప్‌ను ఐర్లాండ్ గ్రూప్‌తో మార్చాలని ఐసీసీని కోరింది. బంగ్లాదేశ్ తన అన్ని గ్రూప్ మ్యాచులను శ్రీలంకలో ఆడాలని భావిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు అన్నీ కూడా కోల్‌కతా, ముంబై వేదికలుగా ఉన్నాయి. అయితే, భద్రతా కారణాలను చూపుతూ భారత్ రావడానికి సిద్ధంగా లేమని బంగ్లా బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
అయితే, బంగ్లా ప్రతిపాదనపై క్రికెట్ ఐర్లాండ్(CI) స్పందించింది. తమ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పింది. మా షెడ్యూల్ మారదని మాకు స్పష్టమైన హామీలు లభించాయని, మేము గ్రూప్ దశలో అన్ని మ్యాచులు కూడా శ్రీలంకలోనే జరుగాయని ఐర్లాండ్ అధికారి వెల్లడించారు. ఐర్లాండ్ ఇప్పటికే షెడ్యూల్ మారదని స్పష్టం చేయడంతో, ఐసీసీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్‌లు గ్రూప్ Bలో ఉంది. అదే సమయంలో, బంగ్లాదేశ్ ప్రస్తుతం వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్ , నేపాల్‌లతో పాటు గ్రూప్ Cలో ఉంది.