Wankhede Stadium Proposal: కేకేఆర్ జెర్సీ ధరించిన అమ్మాయికి ప్రపోజ్ చేసిన ముంబై అభిమాని.. స్టేడియంలో గందరగోళం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wankhede Stadium Proposal: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్ అభిమాని ఒకరు, Kolkata Knight Riders జెర్సీ ధరించి ఉన్న తన భాగస్వామికి స్టేడియంలోనే ప్రపోజ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలో, స్టాండ్స్‌లో మోకాళ్లపై కూర్చున్న ముంబై అభిమాని తన ప్రేయసికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అదే సమయంలో అతని చేతిలోని ఉంగరం జారి కింద పడిపోవడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
Read Also: KitKat Truck Theft: చాక్లెట్ల దొంగ.. 12 టన్నుల ‘కిట్‌క్యాట్’లు ఉన్న ట్రక్కు చోరీ..
Also Read
- Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
- BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
- Vaibhav vs Kohli: 2016లో విరాట్ కోహ్లీ, 2026లో వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప..!
- Mumbai Indians Captain: తప్పు సరిదిద్దుకుంటున్న ముంబై మేనేజ్మెంట్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక?
ఆ ఉంగరం కోసం ప్రేక్షకులంతా సీట్లు, మెట్ల మధ్య వెతకడం ప్రారంభించారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నప్పటికీ, చివరకు ఉంగరం దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నవ్వులతో ఆ ప్రదేశం మార్మోగింది. ఉంగరం దొరికిన తరువాత, యువకుడు మళ్లీ ప్రపోజ్ చేయగా, ఆ యువతి అంగీకరించింది. దీంతో ఆ క్షణం మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. వీరిద్దరూ కలిసి 148 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. చివరికి, ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి అభిమానులకు డబుల్ ఆనందాన్ని అందించింది. ఒకవైపు ప్రేమ ప్రపోజల్, మరోవైపు జట్టు విజయం.. ఈ మ్యాచ్‌ను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి.
Shei Prothom Bhalobashar feeling 💜 pic.twitter.com/AtiWuB863m
— KolkataKnightRiders (@KKRiders) March 30, 2026
తాజావార్తలు
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
టెస్లా లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!