KitKat Truck Theft: చాక్లెట్ల దొంగ.. 12 టన్నుల ‘కిట్‌క్యాట్’లు ఉన్న ట్రక్కు చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KitKat Truck Theft: చాక్లెట్ల దొంగలు చూసి ఉంటారు.. ఒకటి రెండు ఎత్తుకెళ్లి తిని ఉంటారు.. కానీ, యూరప్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ ప్రియులకు ఇష్టమైన కిట్‌క్యాట్ చాక్లెట్లతో నిండిన ఒక భారీ ట్రక్కు దొంగిలించబడటం సంచలనం రేపుతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార దిగ్గజం Nestlé తయారు చేసే KitKat చాక్లెట్లతో నిండిన ట్రక్కు ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
Read Also: Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
సమాచారం ప్రకారం, ఆ ట్రక్కులో సుమారు 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లు ఉన్నాయి. వీటిలో కొత్త శ్రేణికి చెందిన సుమారు 4,13,793 చాక్లెట్ బార్‌లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో చాక్లెట్ల దొంగతనం జరగడం సప్లై చైన్ భద్రతపై సందేహాలు కలిగిస్తోంది. రవాణా సమయంలోనే ట్రక్కు అదృశ్యమవ్వడం గమనార్హం. ఇప్పటివరకు ట్రక్కు గానీ, అందులోని చాక్లెట్ సరుకు గానీ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ ఘటనపై స్పందించిన నెస్లే సంస్థ, “మేము స్థానిక అధికారులతో పాటు మా సరఫరా భాగస్వాములతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము” అని తెలిపింది. అలాగే, ఈ సంఘటన వినియోగదారుల భద్రతపై ఎటువంటి ప్రభావం చూపదని, మార్కెట్‌లో సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
దొంగలను పట్టుకోవడానికి కంపెనీ ఒక కీలక సమాచారాన్ని వెల్లడించింది. ప్రతి చాక్లెట్ బ్యాచ్‌పై ప్రత్యేకమైన కోడ్ ముద్రించబడి ఉంటుంది. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ ఉత్పత్తి ఎక్కడికి వెళ్లిందో గుర్తించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా దొంగిలించబడిన సరుకును ట్రాక్ చేయడం సులభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఘటనపై కిట్‌క్యాట్ సంస్థ కొద్దిగా సరదాగా స్పందించింది. “దొంగల అభిరుచి అద్భుతంగా ఉంది, కానీ దొంగతనం అన్ని వ్యాపారాలకు పెద్ద సమస్యగానే ఉంటుంది” అని వ్యాఖ్యానించింది. అయితే, ఇంత పెద్ద ట్రక్కు ఎక్కడికి మాయమైందన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Regarding recent press coverage pic.twitter.com/Huh4EnFV2J
— KITKAT (@KITKAT) March 29, 2026
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!