Chennai Super Kings: చెన్నై ఓడిపోయినా.. ఎంఎస్ ధోనీ బాగా ఆడితే చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. గుజరాత్‌పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే యెల్లో ఆర్మీ ముందడుగు వేస్తుంది.
శుక్రవారం గుజరాత్పైతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ అభిమానులను అలరించాడు. ఎనిమిదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన మహీ కేవలం 11 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై ఓడిపోతుందని తెలిసినా.. ధోనీ ఇన్నింగ్స్‌తో అభిమానులు ఆనందపడిపోయారు. ఈ విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మనం ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ స్థానం గురించి చర్చలు ఆపేయాలి. అతడు ఏం చేయాలనుకుంటున్నాడనే దానిపై పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ మీరు చెన్నై గెలవాలని కోరుకుంటే.. ధోనీ ఆడుతున్న స్ట్రైక్‌రేట్‌తో మిగతా చెన్నై ఆటగాళ్లు ఆడాలి. అప్పుడు చెన్నై సులువుగా గెలుస్తుంది’ అని క్రిక్‌బజ్‌లో మాట్లాడుతూ సెహ్వాగ్ అన్నాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: James Anderson Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘స్వింగ్ కింగ్’ జేమ్స్ అండర్సన్!
‘నేను వివాదాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎంఎస్ ధోనీ ఎక్కడ బ్యాటింగ్ చేసినా సరే బాగా ఆడాడు. అభిమానులను అలరిస్తున్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే ఫాన్స్ టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి ధోనీ కారణంగా ఎంటర్టైన్మెంట్ దొరికినట్లే. భారీ షాట్లతో విరుచుకుపడుతూ.. బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. చెన్నై విజయం సాధించినా.. ఓడిపోయినా ఆ జట్టు అభిమానులకు అవసరం లేదు. వారికి ధోనీ బాగా ఆడితే చాలు. ప్రేక్షకులు కూడా మహీ ఆటను చూసేందుకే వస్తున్నారు. ధోనీ కూడా వారిని ఎంటర్టైన్ చేసేందుకే ఆడుతున్నాడు’ అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..