Virat Kohli Bowling: బౌలింగ్‌కు రెడీ అయిన కోహ్లీ.. అవాక్కైన అంపైర్, ఫాన్స్.. చివరకు ఏమైందంటే?
- మరోసారి అభిమానులను అలరించిన కింగ్ కోహ్లీ
- 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 43 రన్స్
- బౌలింగ్‌కు రెడీ అయిన కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli’s Funny Bowling Run-Up Moment Goes Viral: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను అలరించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ధర్మశాలలో జరిగిన కీలక మ్యాచ్‌లో 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 43 రన్స్ చేశాడు. కింగ్ క్రీజులో ఉన్నంతసేపు ఆర్సీబీ ఫాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. విరాట్ తన బ్యాట్‌తో మాత్రమే కాదు.. తన చిలిపి చేష్టలతో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. క్వాలిఫయర్-1లో కోహ్లీ చేసిన ఓ ఫన్నీ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో బంతి పట్టుకుని బౌలింగ్ రన్అప్ మార్క్ చేస్తున్నట్లు కనిపించిన కోహ్లీ.. ఆ తర్వాత అంపైర్‌తో సరదాగా నవ్వులు పంచుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ ఛేజింగ్ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్స్ మైదానంలోకి వచ్చారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ చేతిలో బంతి పట్టుకుని బౌలింగ్ రన్అప్ మార్క్ చేస్తూ కనిపించాడు. కొద్దిసేపటి తర్వాత బంతిని పేసర్ జాకబ్ డఫీకి ఇచ్చేశాడు. అనంతరం అంపైర్ వద్దకు వెళ్లి సరదాగా మాట్లాడాడు. ఆపై అంపైర్ వద్ద ఉన్న తన క్యాప్ తీసుకుని ఫీల్డింగ్ చేయడానికి వెళ్లిపోయాడు.అంపైర్, కోహ్లీ నవ్వుకోవడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. కొందరు అభిమానులు ‘ఇప్పుడు కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా?’ అంటూ సరదా పోస్టులు పెడుతున్నారు. కింగ్ చిలిపి చేష్ట అభిమానులను ఆకట్టుకుంది.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
క్వాలిఫయర్-1లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటీదార్ 39 బంతుల్లో 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ టైటాన్స్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసి.. 92 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. డ్రాప్ క్యాచ్‌లు, మిస్ఫీల్డింగ్లు, నోబాల్స్ కారణంగా జీటీ మూల్యం చెల్లించుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లలో ఒకటిగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది.
Kohli took a run-up as if he was bowling 😂😂#kohli pic.twitter.com/J3mTMyM88T
— vivek singh Rahul (@vivekrahul1607) May 26, 2026
తాజావార్తలు
-
BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
-
Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
-
IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
-
Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!