Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!
- దేశవ్యాప్తంగా మార్మోగుతోన్న వైభవ్ సూర్యవంశీ పేరు
- భారత యువ సంచలనంపై మాజీల ప్రశంసల వర్షం
- భవిష్యత్తులో ‘సూపర్ స్టార్’ అవుతాడని జోస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలో వైభవ్ మెరిశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ భారత యువ సంచలనంపై ప్రశంసలు కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో ‘సూపర్ స్టార్’ అవుతాడని జోస్యం చెప్పాడు.
తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన వర్షం ప్రభావిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అదే ఓవర్లో మరో సిక్సర్ కొట్టి తన దూకుడును చూపించాడు. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ… ఐపీఎల్ 2026 ఎప్పటిలాగే హై స్కోరింగ్ మ్యాచ్‌లతో ప్రారంభమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల ప్రదర్శన చూడటం ఆసక్తికరమే. కానీ ఈ సీజన్ ప్రారంభంలో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడగల సామర్థ్యం అతడిలో ఉంది. ఈ టోర్నమెంట్ ముగిసే సమయానికి అతడు నిజమైన సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు’ అని అన్నాడు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా వైభవ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా వంటి టాప్ బౌలర్‌పై తొలి బంతికే సిక్సర్ కొట్టడం అతడి ధైర్యాన్ని, నమ్మకాన్ని చూపుతుందని పేర్కొన్నాడు. ఈ వయసులోనే ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!