Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
- గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం
- 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా సునీల్ నరైన్
- భావోద్వేగంకు గురైన సునీల్ నరైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Narine Gets Emotional on 200 IPL Match: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొదట నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారీ ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సునీల్ నరైన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జట్టు కష్టపడి సాధన చేస్తోందని, అదే ఇప్పుడు ఫలితాల రూపంలో వస్తుందని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్ ఒక కొత్త సవాలుగా ఉంటుందని, దానిని అధిగమించడంపైనే తమ దృష్టి ఉంటుందని తెలిపాడు. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని ఉందంటూ 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన నరైన్ భావోద్వేగంకు గురయ్యాడు. భావోద్వేగంలో ఒక్కసారిగా ఏడ్చేశాడు.
మ్యాచ్ అనంతరం సునీల్ నరైన్ మాట్లాడుతూ… ‘ఈ ఫలితం జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా ఆటగాళ్లు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరం బాగా శ్రమిస్తున్నాం. అందుకే ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇకపై కూడా ఇదే విధంగా విజయాలను కొనసాగించాలని ఆశిస్తున్నాం. ప్రతి గేమ్ కొత్త ఛాలెంజ్‌ను తీసుకొస్తుంది. ఆ పరిస్థితిలో ఎలా గెలవాలన్నదానిపైనే మేము దృష్టి పెడతాం. ఈ రోజు ఒక రకమైన సవాలు ఎదురైంది. తర్వాతి మ్యాచ్‌లో మరోలా ఉండొచ్చు. కానీ ముందున్న పరిస్థితిని అర్ధం చేసుకుని సరిగ్గా ఆడితే విజయం సాధించవచ్చు’ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఆటగాళ్లు ఎక్కువగా ఆలోచించకూడదని సునీల్ నరైన్ అభిప్రాయపడ్డాడు. ‘ఓవర్ థింక్ చేస్తే ఆట మరింత కష్టంగా మారుతుంది. సింపుల్‌గా ఆలోచిస్తూ పరిస్థితులకు తగ్గట్టు ఆడితే మంచి ఫలితాలు వస్తాయి’ అని విండీస్ ఆటగాడు చెప్పాడు. ఈ మ్యాచ్‌తో తన 200వ ఐపీఎల్ మ్యాచ్‌ను పూర్తి చేసిన నరైన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘సీనియర్ ఆటగాడిగా ఇంత దూరం రావడం ఆ దేవుడి దయ. నాకు టాలెంట్, ఆరోగ్యం, శక్తి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. 200 మ్యాచ్‌లు ఆడటం ఒక ఆశీర్వాదం. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రదర్శనలు కొనసాగించాలని అనుకుంటున్నా. కేకేఆర్ ప్రాంచైజీ అద్భుతం. కేకేఆర్ విజయాల్లో నా వంతు పాత్ర పోషిస్తూ జట్టుకు మరిన్ని విజయాలు అందించాలన్నదే నా టార్గెట్’ అని నరైన్ స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!