Uppal Stadium Guidelines: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
- సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైన ఎస్‌ఆర్‌హెచ్
- ఉప్పల్ స్టేడియంలో లక్నో సన్‌రైజర్స్ ఢీ
- ఉప్పల్ స్టేడియంకి వెళ్లే వారు ఇవి తెలుసుకోవాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Stadium Guidelines for IPL 2026 SRH vs LSG Match: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)ను ఎస్‌ఆర్‌హెచ్ ఢీకొట్టనుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణి కొట్టింది. అదే ఊపులో సొంతగడ్డపై విజయం సాధించాలని ఇషాన్ కిషన్ సేన చూస్తోంది. మధ్యాహ్నం 3.30కు ఎస్‌ఆర్‌హెచ్, ఎల్ఎస్‌జీ మ్యాచ్ ఆరంభం కానుంది. మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే సన్‌రైజర్స్ ఫాన్స్ సిద్ధమయ్యారు.
ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి వెళ్తున్న క్రికెట్ అభిమానులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా పోలీసుల భద్రతా నిబంధనలు చాలా కఠినంగా అమలు అవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్టేడియంలోకి ప్రవేశించాలంటే.. ఫిజికల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్, కొంత క్యాష్ కూడా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే స్టేడియం పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ పేమెంట్స్‌పై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్తపడటం మంచిది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!
పవర్ బ్యాంకులు, బ్యాగులు, హెల్మెట్లు, వాటర్ బాటిల్స్ మాత్రమే కాకుండా పెన్లు కూడా స్టేడియం లోపలికి అనుమతించరు. హెల్మెట్ పార్కింగ్ వద్దే పెట్టుకోవాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమిస్తే స్టేడియం ఎంట్రీ వద్దే ఆపివేస్తారు. మ్యాచ్ రోజున ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మెట్రోలో ప్రయాణించడం మంచి ఎంపిక. ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ సాధారణం కావడంతో.. మెట్రో ద్వారా సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చు. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండగా.. గేట్లు మధ్యాహ్నం 12:30 నుంచే తెరుచుకుంటాయి. ఫాన్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని.. నిబంధనలు పాటిస్తూ స్టేడియంలో మ్యాచ్‌ను ఎంజాయ్ చేయండి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!