Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!
- యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శన
- గుజరాత్‌పై బిష్ణోయ్ (4/41) మాయాజాలం
- ఆసక్తికర విషయాలు వెల్లడించిన బిష్ణోయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Bishnoi Shines with 4 Wickets in IPL 2026 RR vs GT: ఐపీఎల్ 2026లో యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఊహించని విజయం అందుకుంది. శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై రాయల్స్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. బిష్ణోయ్ తన మాయాజాలంతో (4/41) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తేవాతియా లాంటి డేంజరస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన బిష్ణోయ్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బిష్ణోయ్.. తన ప్రయాణం, కష్టాలు, ఈ విజయానికి వెనుక ఉన్న శ్రమ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘గత సీజన్ నాకు చాలా కష్టంగా గడిచింది. ఆ సమయంలో కూడా నా ప్రాసెస్‌ను వదల్లేదు. ముఖ్యంగా నా బౌలింగ్ లెంగ్త్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాను. నా లెంగ్త్ తప్పితేనే బ్యాటర్లు సిక్సులు కొడతారు. అది నా బలహీనత అని తెలుసుకున్నా. అందుకే ఈసారి లెంగ్త్‌ను కచ్చితంగా పడేలా ప్రాక్టీస్ చేశాను. ఈ క్రమంలో మానసికంగా, సాంకేతికంగా, శారీరకంగా ఎంతో శ్రమించా. గత సీజన్ మొత్తం, భారత్ తరఫున కూడా ఆడుతూ నా లెంగ్త్‌పై ప్రత్యేకంగా పని చేశా. నా లెంగ్త్‌లో బంతులు వేసినా బ్యాటర్లు సిక్సులు కొడితే నాకు అభ్యంతరం లేదు. ఈరోజు నేను ఫుల్ లెంగ్త్ వేసినప్పుడు బౌండరీలు వచ్చాయి. కానీ గుడ్ లెంగ్త్ బంతులకు రన్స్ రాలేదు. మంచి లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే విజయవంతమవుతానని నమ్మకం కలిగింది. క్రమశిక్షణతో బౌలింగ్ చేయడం వల్లే ఈ ఫలితం వచ్చింది. ఇకపై ప్రతి మ్యాచ్ బాగా ఆడాలనుకుంటున్నా’ అని రవి బిష్ణోయ్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!
ఈ మ్యాచ్‌లో తనకు అత్యంత ఇష్టమైన వికెట్ గురించి అడగగా.. రాహుల్ తేవాతియా వికెట్ ప్రత్యేకమని చెప్పాడు. ‘రాహుల్ మంచి ఫినిషర్. అతను క్రీజులో ఉంటే మ్యాచ్ ఎటు తిరుగుతుందో చెప్పలేం. అతడిని ఔట్ చేయడం చాలా కీలకం. నాకు చాలా ఆనందంగా అనిపించింది’ అని రవి బిష్ణోయ్ పేర్కొన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం తనకు ముఖ్యమని బిష్ణోయ్ స్పష్టం చేశాడు. ‘చివరి ఓవర్లలో తుషార్ దేశ్‌పాండే, ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఇది పూర్తిగా టీమ్ ఎఫర్ట్. మేము యువ జట్టు. ఇలాగే ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం’ అని బిష్ణోయ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!