Sanju Samson Fine: సంజూ శాంసన్‌కు భారీ జరిమానా.. ఇంతకీ ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson fined after argues with umpire in DC vs RR: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. తన క్యాచ్ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదం చేయడంతో.. సంజూ మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం జరిమానాను ఐపీఎల్ అధికారులు విధించారు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ ఓ ప్రకటన జారీ చేసింది. ‘రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం జరిమానా విధిస్తున్నాం. మే 7న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ పడింది. సంజూ ఆర్టికల్ 2.8 లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు తేలింది. అతడు తన నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం మేరకు జరిమానా విధించాం’ అని పేర్కొంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్లోని నాలుగో బంతిని సంజూ శాంసన్ లాంగాన్ వైపు భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద షాయ్ హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టాక హోప్ ఎడమ పాదం బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో కనిపించింది. అయితే రీప్లే పరిశీలించాక థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి చెందిన సంజూ.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అప్పటికి అతడు సెంచరీకి చేరువలో ఉండగా.. జట్టు స్కోరు 162గా ఉంది. రాజస్థాన్ విజయానికి ఇంకా 26 బంతుల్లో 60 రన్స్ చేయాల్సి ఉంది. చివరికి రాజస్థాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు