SRH vs CSK: ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలో రెండు మార్పులు, ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు!
- మరికొద్ది గంటల్లో ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్
- సన్‌రైజర్స్ మ్యాచ్ కోసం సీఎస్కేలో రెండు మార్పులు
- మహీ ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK playing XI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడని మహీ.. ఎస్ఆర్హెచ్పై బరిలోకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నేటి మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడడం లేదని తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు సీఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్‌లో రెండు మార్పులు ఉండనునట్లు తెలుస్తోంది.
గాయంతో దూరమైన పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో ముకేష్ చౌదరి జట్టులోకి రానున్నాడని సమాచారం. కొత్త బంతిని ముకేష్, అన్షుల్ కాంబోజ్ పంచుకోనున్నారు. వీరికి తోడుగా గుర్జప్నీత్ సింగ్ ఉన్నాడు. అయితే మరో కీలక పేసర్ నాథన్ ఎలిస్ గైర్హాజరీతో సీఎస్కే బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. హైదరాబాద్ పిచ్‌పై ఈ కొత్త కాంబినేషన్ ఎలా రాణిస్తుందో చూడాలి. ఓపెనింగ్ జోడీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. రుతురాజ్ గైక్వాడ్ తన పేలవ ఫామ్ ఉన్నప్పటికీ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. అతనితో పాటు సంజు శాంసన్ మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?
అభిమానులకు పెద్ద షాక్ ఏమిటంటే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. కాలు కండరాల గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదట. పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలుస్తోంది. రాబోయే కొన్ని మ్యాచ్‌ల్లో ఆయన తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మహీ ఇంకా డగౌట్లోనే ఉండనున్నాడు. ధోనీ హైదరాబాద్ వచ్చాడని తెలిసి సంబరపడ్డ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు.
తాజావార్తలు
-
TIMS: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
-
AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
-
CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్‌నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
-
Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
-
Trump: ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!