Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
- రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన
- పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ 2026లో తొలి ఓటమి
- సల్మాన్ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్ రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది. భారీ లక్ష్యం 223 పరుగులు ఛేజ్ చేస్తూ.. ఆర్ఆర్ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) అసాధారణ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. షిమ్రోన్ హెట్‌మైర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన ఫెరీరా.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా వినియోగించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో పంజాబ్ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గుసన్‌లపై విరుచుకుపడి మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాడు.
భారీ ఛేజ్‌లో చివరి 6 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 71 పరుగులు అవసరమైన సమయంలో డొనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే (31 నాటౌట్) కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ కలసి 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాది పంజాబ్ కింగ్స్ టాప్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మధ్యలో యుజ్వేంద్ర చాహల్ (3/36) కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పినా.. చివర్లో ఫెరీరా, దూబే జోడి విజయం దిశగా తీసుకెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు డొనోవన్ ఫెరీరా క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియోను రాజస్థాన్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
బాలీవుడ్ నటి ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2014 క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొంది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. ‘ప్రీతి టీమ్ గెలిచిందా?’ అని ఎక్స్‌లో సల్మాన్ ఖాన్ పోస్ట్ పెట్టారు. పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడల్లా సల్మాన్ పాత ట్వీట్ తెరపైకి వస్తుంది. ఇప్పుడు కూడా సల్మాన్ పోస్టుకు ఫెరీరా సరదాగా స్పందించాడు. ‘సారీ భాయ్.. ఈ రోజు కాదు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!