క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తారు.. సినీ స్టార్స్ ఎక్కువగా స్టేడియంలలో సందడి చేస్తారు.. కానీ ఒక సీఎం స్టేడియంకు వెళ్లి క్రికెట్ ను వీక్షించడం అంటే మామూలు విషయం కాదు.. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 17వ మ్యాచ్ నిన్న జరిగింది..
ఈ మ్యాచ్ ను చూడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి వెళ్లారు.. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను సీఎం ప్రత్యక్షంగా వీక్షించారు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తెలుగు హీరో వెంకటేశ్ సీఎం పక్కన కూర్చొని క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు.. సీఎం తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు మ్యాచ్ను వీక్షించినట్లు ఫోటోలను చూస్తే తెలుస్తుంది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో వీటిని చూసిన వెంకీ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఆ ఫోటోలను నెట్టింట మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది చెన్నై. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకొని విజ్రుంభించింది.. చెన్నై పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..