ఐపీఎల్ 2021 మిగిలిచి మ్యాచ్ లకు రిషబ్ పంత్ తమ కెప్టెన్ గా ఉంటాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తలపడింది. ఆ సమయంలోనే భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కు దూరమా కావాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్ గాయం కారణంగా తప్పుకోవడంతో… ఎవరిని కెప్టెన్ చేయాలనీ ఆలోచించి మరో భారత యువ బాట్స్మెన్, వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ ను కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. పంత్ కెప్టెన్సీలో మొత్తం 8 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ అందులో మొత్తం 6 మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఐపీఎల్ బయోబబుల్ లో కరోనా కేసులు నమోదు కావడంతో మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ ఇప్పుడు మళ్ళీ యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మధ్యలో దాదాపు 5 నెలల సమయం ఉండటంతో గయా పడిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కోలుకొని ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో మిగిలిన సీజన్ కు అతడినే కెప్టెన్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఢిల్లీ జట్టు ఈ సీజన్ ను పంత్ ఏ తమ కెప్టెన్ గా కొనసాగుతారు అని ప్రకటించింది.