RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
- ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, జీటీ
- ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- బెంగళూరు vs గుజరాత్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs GT Qualifier 1 Live Streaming: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరానికి తెరలేచింది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ కీలక పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. దీంతో బెంగళూరు, గుజరాత్ జట్లు ఎలాగైనా విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తున్నాయి.
లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్:
లీగ్ దశలో ఆర్సీబీ, జీటీ జట్లు 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత సీజన్లో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరు.. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తూ టైటిల్ డిఫెండ్ చేయాలని చూస్తోంది. మరోవైపు గుజరాత్ మరోసారి ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. రెండు జట్లు బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ లేదా జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, జీటీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సమానంగా నిలిచాయి. ఈ సీజన్లో కూడా రెండు జట్లు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో గెలిచాయి. ఏప్రిల్ 24న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఏప్రిల్ 30న జరిగిన పోరులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పైచేయి సాధించింది. దీంతో క్వాలిఫయర్-1లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం:
ఈ సీజన్లో ధర్మశాల హై స్కోరింగ్ గ్రౌండ్‌గా నిలిచింది. ముఖ్యంగా రాత్రి మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయాలు సాధించాయి. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని ఔట్‌ఫీల్డ్ కారణంగా బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండు సమాన బలాలున్న జట్లు తలపడుతుండటంతో ధర్మశాలలో అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్ గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇప్పుడు ఫైనల్‌కు తొలి అడుగు ఎవరు వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!