RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
- క్వాలిఫయర్-1లో తలపడనున్న ఆర్సీబీ vs జీటీ
- ఆర్సీబీ తుది జట్టుపై ఆసక్తికర చర్చ
- కోహ్లీతో కలిసి ఓపెనింగ్‌కు ఎవరు వస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar Gives Big Update on Phil Salt injury: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ తుది జట్టుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్‌కు ఎవరు వస్తారు? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా లీగ్ దశలో చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జేకబ్ బెతెల్‌కు అవకాశాలు లభించినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వెంకటేశ్ అయ్యర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో క్వాలిఫయర్-1లో ఫిల్ సాల్ట్‌ను తిరిగి జట్టులోకి తీసుకువస్తారా? లేదా అయ్యర్‌కే అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ విషయంపై క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ఫిల్ సాల్ట్ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడని, ప్రాక్టీస్ సెషన్లో డ్రిల్స్ చేస్తున్నాడని తెలిపాడు. అయితే ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. పిచ్‌ను చూసిన తర్వాత తుది జట్టు ఎంపిక ఉంటుందని చెప్పుకొచ్చాడు. సాల్ట్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026లో భారీ స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో బౌలర్ల పరిస్థితిపై కూడా పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం బౌలర్లకు చాలా ఛాలెంజింగ్ పరిస్థితులు ఉన్నాయి. పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. బౌండరీలు చిన్నవిగా ఉన్నాయి. పైగా డ్యూ కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు చిన్న తప్పు చేసినా అది సిక్సర్‌గా వెళుతోంది. మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటికి తగ్గట్టే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పాటీదార్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 ఫైనల్‌ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మార్చిన అంశంపై కూడా ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ స్పందించాడు. అయితే ఈ వివాదంపై ఎక్కువగా మాట్లాడకుండా.. ‘అది నా చేతుల్లో లేదు. ఫైనల్ ఎక్కడ జరిగినా అక్కడే ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం ఫైనల్ చేరడంపైనే ఉంది’ అని స్పష్టం చేశాడు. లీగ్ దశను ఆర్సీబీ, జీటీ జట్లు సమాన పాయింట్లతో ముగించడంతో క్వాలిఫయర్-1 పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ‘రెండు జట్లు ఈ సీజన్లో అద్భుతంగా ఆడాయి. మ్యాచ్ రోజు ఎవరు తమ ప్రణాళికలను మెరుగ్గా అమలు చేస్తారో.. ఒత్తిడిని బాగా ఎదుర్కొంటారో వారే గెలుస్తారు’ అని పాటీదార్ అభిప్రాయపడ్డాడు.
ఆర్సీబీ తుది జట్టు (అంచనా):
రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్/వెంకటేశ్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, జితేశ్ శర్మ, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!