Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
- రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు
- ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్
- 220కి పైగా లక్ష్యాలను అత్యధికసార్లు ఛేజ్ చేసిన జట్టు ఆర్ఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most times successfully chasing 220+ in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 220కి పైగా లక్ష్యాన్ని అత్యధికసార్లు విజయవంతంగా ఛేజ్ చేసిన జట్టుగా ఆర్ఆర్ నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో రాజస్థాన్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. ఇప్పటివరకు ఆర్ఆర్ నాలుగు సార్లు 220+ టార్గెట్లను ఛేజ్ చేసి ప్రత్యేక రికార్డు నెలకొల్పింది.
ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మూడు సార్లు 220కి పైగా లక్ష్యాలను ఛేజ్ చేసి రెండో స్థానంలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ రెండు సార్లు ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట లక్నో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఆర్ఆర్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నోపై సాధించిన విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (93; 38 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ధ్రువ్ జురెల్ (53 నాటౌట్; 38 బంతుల్లో), యశస్వి జైస్వాల్ (43; 23 బంతుల్లో) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌తో భారీ లక్ష్యాలను కూడా ఒత్తిడి లేకుండా ఛేజ్ చేసే సామర్థ్యం రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో ఉందని మరోసారి నిరూపితమైంది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఐపీఎల్ చరిత్రలో 200కి పైగా లక్ష్యాలను అత్యధికసార్లు ఛేజ్ చేసిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200+ టార్గెట్లను ఛేజ్ చేసి టాప్‌లో ఉండగా.. ముంబై ఇండియన్స్ 8 సార్లు ఈ ఫీట్ సాధించింది. రాజస్థాన్ 7 విజయవంతమైన 200+ ఛేజింగ్‌లతో మూడో స్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 సార్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 5 సార్లు ఈ ఘనత సాధించాయి.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బ్యాటింగ్ ఆధిపత్యం బాగా పెరిగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు 200 స్కోరు అంటే మ్యాచ్ గెలిచినట్టే భావించేవారు. కానీ ఇప్పుడు 220కి పైగా స్కోర్లు చేసినా కూడా విజయంపై నమ్మకం ఉండడం లేదు. పవర్ హిట్టింగ్, అటాకింగ్ మైండ్‌సెట్‌తో జట్లు భారీ లక్ష్యాలను సైతం సులభంగా ఛేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు భయంకరంగా మారింది. ఈ క్రమంలోనే రికార్డులు కొల్లగొడుతోంది.
తాజావార్తలు
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
-
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
-
Tesla Roadster: టెస్లా ఫ్లయింగ్ కార్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం.. రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్!
-
Horoscope : నవంబర్‌లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!