Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Rain Hampers Gujarat Titans Ipl 2024 Playoffs Hopes

IPL 2024 Playoffs: వర్షం వచ్చింది.. గుజరాత్‌ టైటాన్స్ కథ ముగిసింది!

Published Date :May 14, 2024 , 9:55 am
By Sampath Kumar
IPL 2024 Playoffs: వర్షం వచ్చింది.. గుజరాత్‌ టైటాన్స్ కథ ముగిసింది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gujarat Titans Out From IPL 2024 Playoffs Due To Rain: ఐపీఎల్ 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ప్లేఆఫ్స్‌ బెర్తు రేసులో ఉన్న గుజరాత్‌.. సోమవారం నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడాల్సి ఉండగా.. ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందే మొదలైన వర్షం.. రాత్రి 10 గంటలు దాటినా ఆగలేదు. దాంతో ఆట సాధ్యం కాలేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌కు తుది గడువు రాత్రి 10.56 గంటలు కాగా.. 10.30కు వర్షం పడుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో కోల్‌కతా, గుజరాత్‌ జట్లకు చెరో పాయింట్‌ దక్కింది.

ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్‌ కచ్చితంగా గెలవాలి. అంతేకాదు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉండేది. కానీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ రద్దవడంతో.. గుజరాత్‌ కథ ముగిసింది. చివరి మ్యాచ్‌ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు చేరుతాయి. ఇప్పటికే నాలుగు జట్లు 14 పాయింట్లు సాధించిన నేపథ్యంలో.. టైటాన్స్‌కు దారులు మూసుకుపోయాయి. గుజరాత్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించింది.

Also Read: Game Changer: ‘దేవర’కు పోటీగా గేమ్‌ ఛేంజర్‌!

ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాయి. 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా.. అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా దాదాపుగా ప్లేఆఫ్స్‌ చేరినట్లే. ప్లేఆఫ్స్‌ చేరేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా సరిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్‌ చేరుతుంది. లక్నోకు కూడా ఛాన్స్ ఉంది. బెంగళూరు, ఢిల్లీలకు మిణుకుమిణుకుమంటున్న ఆశలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gujarat Titans
  • Gujarat Titans IPL 2024
  • Gujarat Titans IPL 2024 Playoffs
  • Gujarat Titans Out
  • IPL 2024

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

  • Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions